పాటలు పాడే పాల సీసా

పసిపాపాయిలకు  పాలు పట్టే బాటిల్‌నే మీరు చూసుంటారు. కానీ బుజ్జాయిలకు బొజ్జ నిండా పాలు పట్టడమే కాదు, వాళ్లు హాయిగా నిద్రపోయే వరకూ జోలపాడే పాల సీసా కూడా ఒకటి ఉంది.

Published : 18 Dec 2022 00:29 IST

పాటలు పాడే పాల సీసా

పసిపాపాయిలకు  పాలు పట్టే బాటిల్‌నే మీరు చూసుంటారు. కానీ బుజ్జాయిలకు బొజ్జ నిండా పాలు పట్టడమే కాదు, వాళ్లు హాయిగా నిద్రపోయే వరకూ జోలపాడే పాల సీసా కూడా ఒకటి ఉంది. ‘బేబీ సౌండ్‌ మ్యూజిక్‌ లైట్‌ మిల్క్‌ బాటిల్‌’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ బాటిల్‌ బ్యాటరీలతో పనిచేస్తుంది. పిల్లలు ఇష్టపడే చిన్న చిన్న లాలిపాటలూ, పక్షుల కువకువలతోపాటూ ఇతర సంగీత ధ్వనులతో ఈ బాటిల్‌కి మొత్తం నాలుగు బటన్స్‌ ఉంటాయి. వీటిల్లో నచ్చింది నొక్కి ఆ కమ్మని సంగీతాన్ని చిన్నపిల్లలకు వినిపించొచ్చు. అమ్మ ఏదైనా పనిలో ఉండి పక్కన లేకపోయినా... చిన్నారులు పాలు తాగుతూ, ఎంచక్కా పాటలూ వింటూ నిద్రలోకి జారిపోతారు. అంతేకాదు... రాత్రివేళ అత్యవసరానికి ఈ బాటిల్‌కున్న లైట్‌ని వెలిగించుకోవచ్చు కూడా. ఆన్‌లైన్‌ మార్కెట్లో పలురంగుల్లో దొరుకుతున్నాయివి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..