నాటి బాలలు... నేటి తారలు!
బాల నటులుగా నటనలో ఓనమాలు దిద్దారు. అగ్రనటీనటులతో కలిసి నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఆ చిన్నారులే పెరిగి పెద్దవారై ఇప్పుడు హీరో హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
బాల నటులుగా నటనలో ఓనమాలు దిద్దారు. అగ్రనటీనటులతో కలిసి నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఆ చిన్నారులే పెరిగి పెద్దవారై ఇప్పుడు హీరో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరూ ఏ సినిమాల్లో నటించారూ అంటే...
‘నాన్న’ కూతురు
మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’లో అందమే అసూయపడుతుందా అన్నట్టు కనిపించింది సారా అర్జున్. ఐశ్వర్యారాయ్ యుక్తవయసు పాత్రలో మెప్పించిన సారా కూడా బాల నటే. ‘నాన్న’లో అమాయకమైన తండ్రిని చూసుకునే కూతురిగా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించింది. మూడేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన సారా అర్జున్ తండ్రి రామ్ అర్జున్ ‘డియర్ కామ్రేడ్’లో విలన్ పాత్రధారి. తండ్రి వల్ల సినీ రంగంలోకి వచ్చిన సారా ‘దాగుడుమూతలు దండాకోర్’లోనూ అలరించింది. అంతేకాదు, ఈ చిన్నారి మెక్‌డొనాల్డ్స్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, కల్యాణ్ జ్యూయలర్స్, మ్యాగీ ప్రకటనల్లోనూ నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం తమిళం, హిందీ, తెలుగులో బిజీగా ఉంది సారా.
చదువుతూ... నటిస్తూ...
‘దృశ్యం’లో వెంకటేష్ చిన్నకూతురిగా పోలీసులకు తడబడకుండా సమాధానాలు చెబుతుంది ఎస్తర్ అనిల్. పలు భాషల్లో రీమేక్ అయిన ఆ చిత్రాల్లోనూ అగ్రకథానాయకుల పక్కన నటించి మంచి పేరు తెచ్చుకుంది. బాలనటిగా ముప్ఫైకిపైగా సినిమాల్లోనూ ప్రకటనల్లోనూ మెరిసిన ఈ కేరళ కుట్టి... తెలుగులో ‘జోహార్’ సినిమాతో హీరోయిన్‌గా ప్రస్థానం మొదలుపెట్టింది. కథానాయికగా నటిస్తూనే ‘దృశ్యం’ సీక్వెల్‌లోనూ అలరించింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతూనే
సినిమాల్లో నటిస్తోందీ అమ్మడు.
క్రికెటర్‌గా తెరపైకి...
తెలిసిన అబ్బాయిలానో, పక్కింటి కుర్రాడిలానో అనిపిస్తాడు సంతోష్ శోభన్‌ను తెరమీద చూసినప్పుడు.‘పేపర్‌బాయ్’, ‘ఏక్ మినీ కథ’, ‘శ్రీదేవి శోభన్‌బాబు’, ‘అన్నీ మంచి శకునములే’తో దూసుకుపోతున్న సంతోష్ ‘వర్షం’ సినిమా దర్శకుడు శోభన్ తనయుడు. ఆయన మరణానంతరం ఎన్నో కష్టాలు పడింది సంతోష్ కుటుంబం. తొలిసారి ‘గోల్కొండ హైస్కూల్’లో క్రికెటర్‌గా నటించి మెప్పించాడు. ఆ తరవాత సినిమాలపైన ఆసక్తి పెరిగి చదువును పక్కనపెట్టి ఎన్నో కష్టాలు పడి హీరోగా నిలదొక్కుకున్నాడు. వరుస సినిమాలతో బిజీ అయిన సంతోష్ త్వరలో ‘ప్రేమ్ కుమార్’తో తెరమీదకు వస్తున్నాడు.
‘బుట్టబొమ్మ’ అనిక
ప్రతి తండ్రీ ఇష్టపడే పాట ‘విశ్వాసం’లోని ‘చిన్నారితల్లి...’. మనసుకు హత్తుకునే ఆ పాటలోని కూతురు అనిక సురేంద్రన్- ‘ఎంతవాడుగాని’, ‘నేను రౌడీనే’, ‘క్వీన్’, ‘ది ఘోస్ట్’ వంటి చిత్రాల్లో బాలనటిగా మంచి పేరు తెచ్చుకుంది. చదువుకుంటూనే సినిమాల్లో నటిస్తున్న అనిక మూడేళ్ల వయసులోనే తెరమీదకొచ్చింది. బాలనటిగా అమితాబ్ బచ్చన్‌తో కలిసి చాలా ప్రకటనల్లోనూ మెరిసింది. ‘బుట్టబొమ్మ’లో కథానాయికగా పరిచయమై మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇంటర్ పూర్తిచేసిన ఈ అమ్మాయి దుల్కర్ సల్మాన్ సరసన ‘కింగ్ ఆఫ్ కోట’తో త్వరలో మన ముందుకు రాబోతోంది.
లా చదివింది
పొట్టిపిల్ల అనగానే గుర్తొస్తుంది ‘బలగం’ ఫేమ్ కావ్యా కల్యాణ్‌రామ్. ‘గంగోత్రి’ ‘ఠాగూర్’, ‘బాలు’, ‘విజయేంద్ర వర్మ’.. వంటి పన్నెండు సినిమాల్లో అగ్ర కథానాయకులతో కలిసి నటించింది. కొత్తగూడెంలో పుట్టి పెరిగిన కావ్య లా చదివి కొంత కాలం హైదరాబాద్‌లో ప్రాక్టీస్ కూడా చేసింది. అయితే కొవిడ్ సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు నటన గురించి ఆలోచించి వృత్తిని పక్కన పెట్టి అవకాశాల కోసం ప్రయత్నించింది. అప్పుడే ‘మసూద’లో అవకాశమొచ్చింది. ‘బలగం’ చూసిన వారికి మనింటి అమ్మాయి అనే భావన కలిగించిన కావ్య నటించిన ‘ఉస్తాద్’ విడుదలకు సిద్ధంగా ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పులు.. ఇద్దరు పాక్ పౌరులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?