ఈ పువ్వులు పాకుతాయి!

ఒక్కసారిగా వాటిని చూస్తే ఎవరైనా పువ్వులనే అనుకుంటారు. కానీ అంతలోనే అవి అటూ ఇటూ పాకుతుంటాయి. ఆ దృశ్యాన్ని చూసిన ఎవరికైనా ‘పువ్వులు పాకడమేంటబ్బా’ అని ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి కావడం సహజం.

Published : 21 Jan 2023 23:48 IST

ఈ పువ్వులు పాకుతాయి!

క్కసారిగా వాటిని చూస్తే ఎవరైనా పువ్వులనే అనుకుంటారు. కానీ అంతలోనే అవి అటూ ఇటూ పాకుతుంటాయి. ఆ దృశ్యాన్ని చూసిన ఎవరికైనా ‘పువ్వులు పాకడమేంటబ్బా’ అని ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి కావడం సహజం. అప్పటికిగానీ తెలియదు అవి పువ్వుల్లా ఉన్న కీటకాలని. దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా వర్షారణ్యాల్లో ఎక్కువగా కనిపించే ఈ కీటకాలు రంగూ రూపంలో చూడ్డానికి పువ్వుల్లానే ఉంటాయి. అందుకే, వీటిని ‘ఫ్లవర్‌ మ్యాంటిస్‌ లేదా ఆర్కిడ్‌ మ్యాంటిస్‌’ అంటారు. సాధారణంగా పక్షులు చిన్న చిన్న పురుగులూ కీటకాల్ని తింటుంటాయి. అయితే, ఫ్లవర్‌ మ్యాంటిస్‌ల కాళ్లు కూడా పూరేకుల్లా ఉండడం వల్ల ఇవి పూల గుత్తుల మీదుండి కదులుతున్నా పక్షులు వీటిని గుర్తించడం కష్టమే. అలా తమను తాము కాపాడుకుంటాయి. మరోపక్క ఇవి మకరందం కోసం సుమాల మీద వాలే చిన్న చిన్న కీటకాలను పట్టుకుని తినేస్తుంటాయి. పూల మధ్యలో పూవుల్లా కలిసిపోయే వీటిని ఆ చిన్న కీటకాలు గుర్తించలేవు మరి. అన్నట్లూ ఈ పురుగులు తాముండే చోటులోని పూల రంగులకనుగుణంగా రోజుల వ్యవధిలోనే ముదురు- లేత రంగుల్లోకి మారుతుంటాయట. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..