అంకెల్లో... 2022

దేశంలో అత్యధిక సోషల్‌ మీడియా ఫాలోయర్లు ఉన్నది విరాట్‌ కోహ్లి, ప్రధాని మోదీలకే. విరాట్‌కు ఇన్‌స్టాలో 22.3 కోట్లు, ట్విటర్‌లో 5.2కోట్లు, ఫేస్‌బుక్‌లో 5 కోట్ల ఫాలోయర్లు ఉన్నారు.

Updated : 29 Dec 2022 13:55 IST

అంకెల్లో... 2022

22.7 కోట్లు

దేశంలో అత్యధిక సోషల్‌ మీడియా ఫాలోయర్లు ఉన్నది విరాట్‌ కోహ్లి, ప్రధాని మోదీలకే. విరాట్‌కు ఇన్‌స్టాలో 22.7 కోట్లు, ట్విటర్‌లో 5.2కోట్లు, ఫేస్‌బుక్‌లో 5 కోట్ల ఫాలోయర్లు ఉన్నారు. మోదీకి ట్విటర్‌లో 8.5కోట్లు, ఇన్‌స్టాలో 7.1 కోట్లు, ఫేస్‌బుక్‌లో 4.7కోట్ల ఫాలోయర్లు ఉన్నారు.  


8.2 లక్షల కోట్లు!

ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2022లో విదేశాల్లోని భారతీయులూ, ప్రవాసులూ స్వదేశానికి పంపిన మొత్తం రూ.8.2 లక్షల కోట్లు. దేశ జీడీపీలో ఇది మూడు శాతం. ప్రపంచంలోనే మనది మొదటి స్థానం. ఈ ఏడాది వచ్చిన విదేశీ పెట్టుబడుల కంటే ఇది ఎక్కువ.


800 కోట్లు...

ఈ ఏడాది నవంబరు 15 నాటికి ప్రపంచ జనాభా. 2011లో ఇది 700 కోట్లు కాగా, 2037 నాటికి 900 కోట్లకు చేరనుందని అంచనా.


11 లక్షల కోట్లు

టెస్లా షేర్లు పడిపోవడంతో ఎలన్‌ మస్క్‌ ఈ ఏడాది కోల్పోయిన సంపద విలువ రూ.11 లక్షల కోట్లు.


ఆపిల్‌... 200 లక్షల కోట్లు...

ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక విలువ కలిగిన కంపెనీ ఆపిల్‌ విలువ సుమారు రూ.200 లక్షల కోట్లు. తర్వాత స్థానంలో సౌదీ అరేబియా ఆయిల్‌ కంపెనీ ‘సౌదీ ఆరమ్‌కో’ ఉంది. దీని విలువ రూ.180 లక్షల కోట్లు. ఆ తర్వాత స్థానాల్లో మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌,
అమెజాన్‌, టెస్లా ఉన్నాయి.


నంబర్‌ 1

దేశంలో అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా గతేడాది వరకూ రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఉండగా, ఈ ఏడాది ఆయన్ని గౌతమ్‌ అదానీ అధిగమించారు. ఆసియాలోనే మొదటి స్థానం అదానీది. 2021లో తన సంపదను మూడింతలు పెంచిన అదానీ, ఈ ఏడాది దాన్ని రెట్టింపు చేశారు. ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ రూ.11.9 లక్షల కోట్ల్లు.  రూ.7.2 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో ఉన్నారు.


37 కోట్లు...  

భారత్‌లో సోషల్‌ మీడియా వినియోగిస్తున్నవారు.  


1000 కోట్లు

ఆర్‌ఆర్‌ఆర్‌, కె.జి.ఎఫ్‌-2... ఈ ఏడాది విడుదలైన భారతీయ సినిమాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసినవి.


1,34,66,412

2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అమ్ముడైన ద్విచక్రవాహనాల సంఖ్య.


17 లక్షల కోట్లు...

దేశంలో అత్యధికంగా మార్కెట్‌ విలువ ఉన్న సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. దీని విలువ రూ.17 లక్షల కోట్లు. తర్వాత స్థానాల్లో టీసీఎస్‌ రూ.13 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 8.1లక్షల కోట్లు, ఇన్ఫోసిస్‌ 6.9లక్షల కోట్లు ఉన్నాయి.


18000 కోట్లు

ఈ ఏడాది జనవరిలో ఎయిర్‌ ఇండియాని టాటా గ్రూప్‌ చేజిక్కించుకోవడానికి చెల్లించిన మొత్తం. 68 ఏళ్ల తర్వాత ఎయిర్‌ ఇండియా తిరిగి టాటా గ్రూప్‌కు చేరింది. దీన్ని 1932లో ‘టాటా ఎయిర్‌లైన్స్‌’ పేరుతో జేఆర్డీ టాటా ప్రారంభించారు. 1953లో దీన్ని జాతీయం చేశారు.


76వేల కోట్లు...

ఈ ఏడాది పండగ సీజన్‌ (సెప్టెంబరు 22-అక్టోబరు 23)లో ఈ-కామర్స్‌ పోర్టళ్లు జరిపిన అమ్మకాల విలువ. మొత్తం 12 కోట్ల మంది వీటిని కొనుగోలు చేశారు. వీరిలో 64 శాతం ద్వితీయశ్రేణి నగరాలకు చెందినవారే.


2 లక్షల కోట్లు...

2022 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నిర్వహణ కోసం ఖతార్‌ చేసిన ఖర్చు రూ.2లక్షల కోట్లు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..