శక్తిమంతమైన ఫిల్టర్‌!

నదుల్లో సముద్రాల్లో సరస్సుల్లో కలుస్తోన్న మైక్రోప్లాస్టిక్స్‌ కారణంగా నీరు ఎంతగా కలుషితం అవుతుందో తెలిసిందే. ఎన్ని రకాల ఫిల్టర్‌లు వాడుతున్నా ఇంకా ఎక్కడో మిగిలే ఉంటున్నాయి.

Published : 21 Jan 2023 23:35 IST

శక్తిమంతమైన ఫిల్టర్‌!

దుల్లో సముద్రాల్లో సరస్సుల్లో కలుస్తోన్న మైక్రోప్లాస్టిక్స్‌ కారణంగా నీరు ఎంతగా కలుషితం అవుతుందో తెలిసిందే. ఎన్ని రకాల ఫిల్టర్‌లు వాడుతున్నా ఇంకా ఎక్కడో మిగిలే ఉంటున్నాయి. అందుకే 99.9 శాతం మైక్రో ప్లాస్టిక్‌ రేణువుల్ని తొలగించే శక్తిమంతమైన వాటర్‌ ఫిల్టర్‌ను దక్షిణ కొరియాలోని డేగు గైయాంగ్‌బక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. కోవాలెంట్‌ ట్రియాజీన్‌ ఫ్రేమ్‌వర్క్‌ అని పిలిచే ఈ రం‌ధ్రాలతో కూడిన పదార్థం కేవలం పది సెకన్లలోనే మైక్రోప్లాస్టిక్స్‌ను తొలగించిందట. పైగా ఇది వొలటైల్‌ కర్బన పదార్థాలనీ నిర్మూలించిందట. కాబట్టి ఈ కొత్త టెక్నాలజీతో కరెంట్‌ లేని ప్రదేశాల్లో కూడా కాలుష్య రహిత మంచినీళ్లు అందించవచ్చు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు