కత్తిరించిన ‘చిత్రం’..!

కాగితాల్ని ఓ పద్ధతిలో కత్తిరిస్తూ పూలగుత్తినో, చిన్న ఇంటి ఆకారాన్నో తెప్పించడం చూసే ఉంటారు. కాసింత సాధన చేస్తే కూసింత ఓర్పు ఉంటే అది ఎవరికైనా సాధ్యమవ్వొచ్చేమో. కానీ

Published : 14 Aug 2022 00:43 IST

కత్తిరించిన ‘చిత్రం’..!

కాగితాల్ని ఓ పద్ధతిలో కత్తిరిస్తూ పూలగుత్తినో, చిన్న ఇంటి ఆకారాన్నో తెప్పించడం చూసే ఉంటారు. కాసింత సాధన చేస్తే కూసింత ఓర్పు ఉంటే అది ఎవరికైనా సాధ్యమవ్వొచ్చేమో. కానీ అదే పేపర్‌ని కత్తిరిస్తూ మనుషుల రూపాల్నీ అచ్చుగుద్దినట్టుగా తెప్పించాలంటే మాత్రం కచ్చితంగా అందుకు అరుదైన నైపుణ్యం ఉండితీరాల్సిందే. బెంగళూరుకు చెందిన సోమశేఖర్‌ ఆ కళతోనే ఇప్పుడు ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాడు. ఫొటోల్నే ‘పేపర్‌ కట్‌ ఆర్ట్‌ పోర్ట్రెయిట్స్‌’లా తయారుచేస్తున్నాడు. ముందుగా కాగితం మీద వ్యక్తుల రూపురేఖల్ని గీసుకుని తర్వాత ఆ పోలికలు సరిగ్గా వచ్చేలా నిదానంగా కత్తిరిస్తాడు. ఇదంతా అనుకున్నంత సులువేం కాదండోయ్‌. ఎందుకంటే... ఏమాత్రం అటూఇటూ అయినా బొమ్మ ఆకారమే పూర్తిగా మారిపోతుంది. అందుకే మరి, ఈ ఆర్టిస్టు చేసే పేపర్‌ బొమ్మలకు అంత ప్రత్యేకత. ఫొటోలూ, పెయింటింగులూ బోర్‌ కొట్టేసిన వారెందరో ఇప్పుడు సరికొత్తగా తమ మధురజ్ఞాపకాల్ని ఈ ‘పేపర్‌ కట్‌ పోర్ట్రెయిట్స్‌’లా చేయించుకుని పదిలపరుచుకుంటున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..