వలలో ‘క్యారెట్‌’

బుజ్జిబుజ్జిగా ముద్దొచ్చే గోల్డ్‌ఫిష్‌లను చాలామంది ఇళ్లలో ఫిష్‌ట్యాంకులలో పెంచుకుంటూ ఉంటారు కదా. వాటి బరువు ఎంతుంటుంది? 100-300 గ్రాములుంటాయి. కొన్నైతే నాలుగున్నర కేజీల వరకు పెరుగుతాయి.

Published : 03 Dec 2022 23:55 IST

వలలో ‘క్యారెట్‌’

బుజ్జిబుజ్జిగా ముద్దొచ్చే గోల్డ్‌ఫిష్‌లను చాలామంది ఇళ్లలో ఫిష్‌ట్యాంకులలో పెంచుకుంటూ ఉంటారు కదా. వాటి బరువు ఎంతుంటుంది? 100-300 గ్రాములుంటాయి. కొన్నైతే నాలుగున్నర కేజీల వరకు పెరుగుతాయి. కానీ, ఫ్రాన్స్‌లోని షాంపేన్‌ దగ్గర బ్లూవాటర్‌ లేక్స్‌లో వలేసిన బ్రిటీష్‌ ఫిషర్‌మ్యాన్‌ ఆండీ హ్యాకెట్‌కు 30.5 కేజీల బాహుబలి గోల్డ్‌ఫిష్‌ చిక్కింది. ఆరెంజ్‌ కలర్‌లో మెరిసిపోతున్న దానికి ఆయన ‘ద క్యారెట్‌’ అని పేరుపెట్టాడు. ఫొటోలకు పోజిచ్చిన తర్వాత దాన్ని భద్రంగా నీళ్లలోకి వదిలేశాడు. అన్నట్టు, ఇంతకు ముందువరకు వలలో పడిన గోల్డ్‌ఫిష్‌ల్లో అతిపెద్ద దాని బరువెంతో తెలుసా... 13.6 కేజీలే. 2019లో యూఎస్‌లోని మిన్నేసొటాలో జాసన్‌ ఫగట్టే అనే వ్యక్తికి దొరికిందది. దాని రికార్డును ‘క్యారెట్‌’ ఇప్పుడు తిరగ రాసిందన్న మాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు