Published : 27 Nov 2022 00:55 IST

గుండెకు సప్లిమెంట్లు మంచివేనా?

చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడానికి కొందరు సప్లిమెంట్లనీ వాడుతుంటారు. అయితే వీటివల్ల పెద్దగా ఫలితం ఉండదనీ డబ్బులు వృథా అనీ చెబుతున్నారు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన పరిశోధకులు. ఈ బృందం- హృద్రోగుల్ని ఆరునెలలపాటు రిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైందట. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు వైద్యులు ఇచ్చిన మందులకు బదులుగా సప్లిమెంట్లను వాడినప్పుడు- వాళ్లలో ఏమాత్రం మార్పు కనిపించలేదట. ఇందుకోసం వీళ్లు హృద్రోగ సమస్యలేమీ లేకుండా చెడు కొలెస్ట్రాల్‌ కాస్త ఎక్కువగా ఉన్న 200 మందిని ఎంపిక చేసి, వాళ్లను ఎనిమిది వర్గాలుగా విభజించారట. వాళ్లలో ఒక వర్గానికి ఏమీ ఇవ్వకుండానూ రెండో విభాగంలో వాళ్లకి కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందుల్నీ మిగిలినవాళ్లకి రకరకాల సప్లిమెంట్లనీ ఇచ్చారట. నెలరోజుల తరవాత అందరినీ పరిశీలించినప్పుడు- కేవలం మందులు వేసుకున్న వాళ్లలోనే చెడు కొలెస్ట్రాల్‌ 40 శాతం తగ్గిందనీ, మిగిలినవాళ్లలో పెద్దగా మార్పు కనిపించలేదనీ అంటున్నారు. సో విటమిన్లను ట్యాబ్లెట్ల రూపంలో మింగడం కన్నా ఆహారం రూపంలో తీసుకోవడమే మేలన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..