ఆ రెండింటికీ సంబంధం ఏమిటి?

నిద్రలేమికీ ఆల్జీమర్స్‌కీ సంబంధం ఉంది అంటున్నారు క్వీన్స్‌ల్యాండ్‌ యూనివర్సిటీ నిపుణులు. అదీ శ్వాస ఇబ్బందితో నిద్ర పట్టనివాళ్లలోనే ఆల్జీమర్స్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయట

Published : 27 Nov 2022 01:00 IST

ఆ రెండింటికీ సంబంధం ఏమిటి?

నిద్రలేమికీ ఆల్జీమర్స్‌కీ సంబంధం ఉంది అంటున్నారు క్వీన్స్‌ల్యాండ్‌ యూనివర్సిటీ నిపుణులు. అదీ శ్వాస ఇబ్బందితో నిద్ర పట్టనివాళ్లలోనే ఆల్జీమర్స్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయట. వాళ్లలో హానికర ప్రొటీన్లు విడుదలై జ్ఞాపకశక్తికి కారణమయ్యే నరాల క్షీణతను కలిగిస్తున్నట్లు ఎమ్మారై స్కాన్‌ ద్వారా గుర్తించారట. అదెలా అంటే- నిద్రపోతున్న ఎలుకలకి శ్వాసకి ఇబ్బంది కలిగించి మరీ వాటిని నిద్రలేమికి గురిచేసి మెదడుని నిశితంగా గమనించారట. అప్పుడు మెదడుకి ఆక్సిజన్‌ తక్కువగా అందడంతో కొన్ని నరాలు దెబ్బతినడం స్పష్టంగా కనిపించిందట. అంతేకాదు, సహజంగానే నిద్రలేమితో బాధపడతున్న ఎలుకల్లో కూడా ఇదే రకమైన సమస్యని గమనించారట. దాన్నిబట్టి, నిద్రలేమికీ ఆల్జీమర్స్‌కీ మధ్య సంబంధం ఉన్నట్లు తేల్చి చెబుతున్నారు. సో, వృద్ధాప్యంలో వీలైనంత హాయిగా నిద్రపట్టేలా చూసుకుంటే- మతిమరుపు నుంచి కొంతవరకూ తప్పించుకోవచ్చు అని వివరిస్తున్నారు సదరు పరిశోధకులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..