Published : 09 Jan 2022 00:19 IST

క్రోషెట్‌ దుప్పట్లు.. వెచ్చగా ఉంచే థర్మల్‌జీన్స్‌

చలికాలం పూర్తయ్యేవరకూ... స్వెటర్‌, షాల్‌, జాకెట్‌, మంకీక్యాప్‌, రగ్గులు.. అంటూ బోలెడు రకాలను రెడీగా పెట్టుకున్నా... ఎప్పుడూ అవే అంటే ఎవరికైనా విసుగే. అందుకే... వాటన్నింటినీ పక్కనపెట్టేసి... ఇలాంటివి ఎంచుకుని చూడండి. ఫ్యాషన్‌ని అనుసరిస్తూనే చలి నుంచి తప్పించుకోవచ్చు.


ముద్దొచ్చే మంకీక్యాప్‌

మంకీ క్యాపే... స్కార్ఫూ, గ్లౌజుల్లానూ ఉపయోగపడితే ఎలా ఉంటుంది... అది అచ్చంగా మంకీ ముఖంతో వస్తే... కుందేలు చెవులతో మెరిసిపోతే... ఎంత బాగుంటుందో కదూ. ఈ చలికాలంలో ఆ థ్రిల్‌ను పొందాలంటే కొత్తగా వస్తున్న ‘కిడ్స్‌ బేబీ వింటర్‌ త్రీ ఇన్‌ వన్‌ హ్యాట్‌, షైనీ చిల్డ్రన్‌ క్యాప్‌...’ ఇంకా రకరకాల జీవుల ఆకారాలతో ఉండే ‘యానిమల్‌ క్యాప్స్‌’ కొనేయండి. అటు చల్లగాలిని తట్టుకోవడానికి రక్షణగానూ ఉంటాయి, ఇటు పిల్లలకు వేసుకోవాలనిపించేంత ఆకర్షణీయంగానూ కనిపిస్తాయి. విభిన్నమైన రంగుల్లో ఆన్‌లైన్‌ సైట్లలో అందుబాటులో ఉన్నాయివి!


వెచ్చగా ఉంచే థర్మల్‌జీన్స్‌!

న్నిసార్లు వేసుకున్నా సరే... బోర్‌కొట్టని దుస్తుల్లో జీన్స్‌ ప్యాంట్లూ, షర్ట్‌లే ఉంటాయని చెప్పక్కర్లేదు. అవి కాస్త మందంగానే ఉన్నా... చలిని ఆపుతాయని చెప్పలేం. అలాగని చలికాలం పూర్తయ్యేవరకూ వాటిని వేసుకోకుండానూ ఉండలేం. తయారీదారులు దీన్ని గుర్తించారో ఏమో... థర్మల్‌ జీన్స్‌ పేరుతో కొత్తరకం ప్యాంట్లూ, షర్ట్‌లనీ మార్కెట్లో విడుదల చేశారు. వీటిని వేసుకుంటే ట్రెండీగా కనిపించడంతోపాటూ... చలి సమస్యా ఉండదని చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. చూడ్డానికి ఇవి సాధారణ జీన్స్‌లానే కనిపించినా వీటి లోపలివైపు ఫర్‌ జతచేసి ఉంటుంది. దాంతో శరీరం వెచ్చగా ఉంటుందనీ.. అదనంగా స్వెటర్‌ వేసుకోవాల్సిన అవసరం లేదనీ చెప్పేస్తున్నారు. బాగున్నాయి కదూ..


క్రోషెట్‌ దుప్పట్లు.. వచ్చేశాయి

లిగా ఉందని బాగా మందంగా ఉండే రగ్గు కప్పుకుంటే... గుచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. పోనీ.. రెండు దుప్పట్లను కప్పుకుందామంటే అసౌకర్యంగా ఉంటుంది. అలాగని రోజంతా స్వెటర్‌ను వేసుకునీ ఉండలేం. ఇలాంటి ఇబ్బందులన్నీ లేకుండా ఉండాలంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న క్రోషెట్‌ దుప్పట్లను ఎంచుకుని చూస్తే సరి. చలిని ఎంతో బాగా అడ్డుకునే వీటిని- ఒక స్వెటర్‌ అల్లినట్లుగానే చాలా ఓపిగ్గా, ఓ పద్ధతిప్రకారం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని క్రోషెట్‌ సూదితో అల్లుతారు. గళ్లు, పూలు, బొమ్మలు... ఇలా పిల్లలకూ, పెద్దలకూ ఉపయోగపడేలా రకరకాల డిజైన్లలో దొరుకుతున్న ఈ దుప్పట్లు కానుకగా ఇచ్చేందుకూ బాగుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..