హహ్హహ్హ

మేనేజర్‌గారూ నేను కొత్తగా బ్యాంకు అకౌంట్‌ తీసుకోవాలనుకుంటున్నా.

Updated : 27 Mar 2022 05:25 IST

హహ్హహ్హ

ఆకూ వక్కా సున్నం...

విజయ: మేనేజర్‌గారూ నేను కొత్తగా బ్యాంకు అకౌంట్‌ తీసుకోవాలనుకుంటున్నా.

మేనేజర్‌: మంచిదమ్మా... పాన్‌ వివరాలు చెప్పండి.

విజయ: ఓ అంతేనా అండీ... తమలపాకూ, వక్కా, సున్నం...ఉంటాయండీ.

మేనేజర్‌: అదేంటమ్మా...

విజయ: ఇంకా వివరంగా చెప్పాలాండీ... ‘పాన్‌’కి ఓ పుల్లా, చెర్రీ కూడా ఉంటాయండీ.


చూసి చెప్పరా...

‘హలో సర్‌, పంజాగుట్ట ట్రాఫిక్‌ ఎస్‌ఐగారా...’

‘అవునమ్మా చెప్పండి...’

‘సార్‌... మీ స్టేషన్‌ బయట సీసీ కెమెరా పనిచేస్తుందా?’

‘హా చేస్తుందమ్మా... ఎందుకు?’

‘ఏం లేదు సర్‌, మీ స్టేషన్‌ ఎదురుగా ఉండే పానీపూరీ బండివాడు ఇవాళ బండి పెట్టాడో లేదో కాస్త చూసి చెప్పరా.


ఇదీ హోంవర్కే!

తల్లి: రవీ, ఉదయం నుంచీ ఒకటే ఆటలు. వచ్చి హోం వర్క్‌ చేసుకో.

రవి: ఇది కూడా హోం వర్కేనమ్మా. మా డ్రిల్‌ మాస్టారిచ్చారు.


జావా

తండ్రి: ఈ పదివేలు తీసుకెళ్లి జావా నేర్చుకో...

వెంగళప్ప: జావ నేర్చుకోవడానికి పది వేలు ఎందుకు? అమ్మ వంట గదిలో అరగంటలో నేర్పిస్తుంది.


డిజైన్‌ నచ్చలేదు...

భార్య: ఏవండీ ఏవండీ...

నేను మార్కెట్‌ నుంచి ఇంటికొస్తుంటే బంగారు నెక్లెస్‌ దొరికింది. చూడ్డానికి ఓ పది తులాలకుపైనే ఉంటుందండీ...

భర్త: అవునా ఏదే... నాకు చూపించు...

భార్య: తీసుకు రాలేదండీ... అక్కడే పడేశా.

భర్త: అదేంటే... బంగారం అన్నావూ, పది తులాలకు పైమాటే అంటున్నావూ... ఎందుకు తేలేదూ?

భార్య:నాకు ఆ డిజైన్‌ నచ్చలేదండీ. పెట్టుకుని చూస్తే నా మెడకి నప్పలేదనిపించింది.

భర్త: ఆఁ...


మరి తెలిసేదెప్పుడో!

చిన్నప్పుడు అమ్మ అంటుంది- నీకేం తెలియదు మాట్లాడకు... అని.

పెళ్ల్లయ్యాక భార్య అంటుంది- మీకేం తెలియదు ఊరుకోండి... అని.

వయసైపోయాక పిల్లలు అంటారు- నీకేం తెలియదు మాకేం చెప్పొద్దు... అని.

ఇంతకీ తెలిసే వయసేదో ఎప్పటికి తెలుస్తుందో!


అందులోనూ వీకే...

టీచర్‌: నీ పేరు స్పెలింగ్‌ తప్పుగా రాశావని 50 సార్లు రాయమంటే ఇరవై సార్లే రాశావేంటీ...

టింకు: నేను లెక్కల్లో కూడా వీకే టీచర్‌!


‘ఖ’కీ... ‘క’కీ తేడా...

ఒక ప్రేమ జంట కలవడానికి కారణం ప్రేమలేఖ!

ఒక పెళ్లి జంట విడిపోవడానికి కారణం ప్రేమలేక!


650 ట్యాబ్లెట్లు మింగాడు

సుమన్‌: అరే మచ్చా...క్యాంటీన్‌లో రాజుగాడు కళ్లు తిరిగిపడిపోయాడ్రా..

రాము: ఏమైందిరా వాడికి?

సుమన్‌: ఏం లేదురా జ్వరం వచ్చిందని డాక్టర్‌ దగ్గరకు వెళితే... డోలో 650 వేసుకోమన్నాడంట.

రాము: అయితే...

సుమన్‌: వీడు ఆరొందల యాభై డోలో-650 ట్యాబ్లెట్లు మింగాడు.


ఎలాగూ శిక్ష తప్పదు!

లాయర్‌: చూడు శివా! మొన్న హత్య జరిగిన ప్రదేశంలో నువ్వు లేవని నిరూపించావంటే నిన్ను విడుదల చేస్తారు...

శివ: కానీ ఆ సమయంలో నా గర్ల్‌ఫ్రెండ్‌తో పార్కులో ఉన్నానని తెలిస్తే మా ఆవిడ పట్టుకుంటుందే!


ఫార్మాట్‌ చేశాడు

‘ఒరేయ్‌ త్వరలో సుధీర్‌ పెళ్లంట కదా... మరి పనులన్నీ అయినట్టేనా?’ అడిగింది రాజేశ్‌ని వాళ్ల అమ్మ.

‘హాఁ అమ్మా... పాత సిమ్‌ కార్డ్‌ తీసేశాడు. గర్ల్‌ ఫ్రెండ్స్‌ ఫొటోలూ వీడియోలూ డిలీట్‌ చేసి రెండుసార్లు ఫోన్‌ని ఫార్మాట్‌ చేశాడు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్టర్‌, స్నాప్‌లో కొత్త అకౌంట్లు తెరిచాడు. దాదాపు అయిపోయినట్టేనమ్మా...’ అన్నాడు తడుముకోకుండా రాజేశ్‌.


అసలు సంగతి తెలియక!

పోలీసు: మీ ఆవిడను నీళ్లలోకి ఎందుకు తోశావు...

గిరి: ఈత రాదనుకుని!


అలాగా!

పడగవిప్పి ఆడుతున్న పాము మీద రాయి విసరడం ఎంత ప్రమాదమో సీరియల్‌ చూస్తున్న పెళ్లాన్ని కొంచెం టీ కలిపి ఇమ్మనడమూ అంతే ప్రమాదం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..