Updated : 04 Dec 2022 06:44 IST

Weekly Horoscope: గ్రహబలం (డిసెంబరు 4 - డిసెంబరు 10)


ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. పొరపాటు జరగనివ్వద్దు. ముందస్తు ప్రణాళికతో లక్ష్యాన్ని సాధించాలి. ఆత్మీయుల సలహా తప్పనిసరి. దేనికీ సంకోచించవద్దు. మనసు చెప్పినట్లు చేయండి. వ్యాపారంలో కృషి అవసరం. నవగ్రహశ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది.


ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. స్వల్ప అవాంతరాలను అధిగమిస్తే ఆశయం నెరవేరుతుంది. అదృష్ట, ధనయోగాలున్నాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. సహనంతో పనులు పూర్తిచేయండి. కోరుకున్నది లభిస్తుంది. సూర్యస్తోత్రం శుభాన్నిస్తుంది.


ఉద్యోగంలో శుభఫలితముంది. ప్రశంసలు అందుకుంటారు. కొన్ని ఆటంకాలు ఉంటాయి. స్నేహితుల సహకారం అవసరం. వ్యాపారంలో జాగ్రత్త. దేనికీ ఆవేశపడవద్దు. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకోండి. వివాదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో విజయం లభిస్తుంది. ఖర్చు పెరగవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది.


శుభకాలం నడుస్తోంది. మంచి నిర్ణయాలు తీసుకోండి. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. అదృష్టయోగముంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. మిత సంభాషణ మేలు. పెద్దల ప్రశంసలు ఉంటాయి. ధర్మమార్గంలో లక్ష్యాన్ని సాధించాలి. ధనధాన్య లాభాలుంటాయి. జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. ఇష్టదైవాన్ని తలచుకుంటే శాంతి లభిస్తుంది.


ఆర్థికంగా శుభఫలితం ఉంది. వ్యాపార బలం పెరుగుతుంది. పట్టుదలతో పనిచేయాలి. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. ఆనందించే అంశముంది. సంకల్పసిద్ధి ఉంటుంది. ఆవేశపరిచే వారున్నారు. శాంతచిత్తంతో ఉండాలి. బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలి. ధర్మం రక్షిస్తుంది. దుర్గాదేవిని ధ్యానించండి, అంతా శుభమే జరుగుతుంది.


కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. ప్రతిభ చూపి బ్రహ్మాండమైన గుర్తింపు పొందుతారు. ప్రతిఫలమూ అందుతుంది. స్థిరత్వం సాధిస్తారు. ఆశయాలు నెరవేరతాయి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. చక్కని భవిష్యత్తు లభిస్తుంది. ఆనందించే అంశాలుంటాయి. ఇష్టదేవతను స్మరిస్తే శాంతి లభిస్తుంది.


కాలం కొంత వ్యతిరేకంగా ఉంది, మనోబలంతో ముందుకు వెళ్లాలి. విఘ్నాలున్నాయి. తెలివిగా వ్యవహరించాలి. మీ చొరవ వల్ల శత్రువులు మిత్రులవుతారు. అనుకూలించే అంశాలుంటాయి. ఒత్తిడి కలిగించే వారుంటారు. దృఢసంకల్పంతో ముందుకు సాగాలి. ఓర్పును పరీక్షించే కాలమిది. అవాంతరాలను చాకచక్యంగా అధిగమించాలి. శివారాధన ఉత్తమం.


కాలం సహకరిస్తోంది. పనిలో శ్రద్ధపెట్టండి. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. వ్యాపారంలో విజయం ఉంది. కృషికి రెట్టింపు ఫలితం వస్తుంది. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బంగారు భవిష్యత్తును సాధించవచ్చు. మిత్రుల సలహా పనిచేస్తుంది. కుటుంబపరంగా ఆనందిస్తారు. ఇష్టదైవస్మరణతో శాంతి లభిస్తుంది.


ధైర్యంగా లక్ష్యాన్ని చేరండి. ఉద్యోగం శుభప్రదం. చిరస్థాయిగా నిలిచిపోయే ఫలితం లభిస్తుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సద్వినియోగం చేసుకోవాలి. విఘ్నాలను బుద్ధిబలంతో ఎదుర్కొని పనుల్ని పూర్తిచేయాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరి. ఇష్టదేవతాధ్యానంతో కార్యసాఫల్యం లభిస్తుంది.


కాలం సహకరిస్తోంది. అనేక విజయావకాశాలున్నాయి. ఉద్యోగంలో శుభయోగముంది. అభీష్టం సిద్ధిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. మిత్రుల వల్ల శక్తి పెరుగుతుంది. నూతన కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అవరోధాలను అధిగమిస్తారు. అధికార లాభం సూచితం. వ్యాపారంలో లాభముంటుంది. కుటుంబపరంగా కలిసివస్తుంది. ఇష్టదైవారాధన శ్రేష్ఠం.


కార్యసిద్ధి ఉంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉత్సాహంగా పని మొదలుపెట్టండి. ఆత్మీయుల వల్ల మేలు చేకూరుతుంది. వ్యాపారంలో ధనలాభముంది. అదృష్ట ఫలితాలు అందుతాయి. పదిమందికీ ఆదర్శంగా ఉంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల ద్వారా ఆనందించే అంశాలున్నాయి. వారాంతంలో శుభం చేకూరుతుంది. ఇష్టదైవారాధన ఉత్తమం.


శుభఫలితముంది. మంచి మనసుతో మీ బాధ్యతలను నిర్వహించండి. వెంటనే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. ధైర్యంగా సంభాషించాలి. ప్రయత్నబలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రణాళిక వేసుకోవాలి. సన్నిహితుల సహకారం లభిస్తుంది. సూర్యనమస్కారం శుభాన్నిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు