Weekly Horoscope: రాశిఫలం ( మే 1 - 7 )

అనేక శుభాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. విశేషమైన ధన లాభముంది. పట్టుదలతో అనుకున్న పనుల్ని పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. అపోహలు తొలగుతాయి.

Updated : 04 Aug 2022 17:08 IST

Weekly Horoscope: రాశిఫలం ( మే 1 - 7 )

గ్రహబలం ( మే 1 - 7 )


అనేక శుభాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. విశేషమైన ధన లాభముంది. పట్టుదలతో అనుకున్న పనుల్ని పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. అపోహలు తొలగుతాయి. దేనికీ తొందరవద్దు. శ్రేష్ఠమైన ఫలితాలు రాబోతున్నాయి. సంతోషించే సందర్భాలుంటాయి. అధిక వ్యయం సూచితం. లక్ష్మీదేవిని ధ్యానిస్తే మంచిది.


శుభకాలం మొదలైంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగరీత్యా మంచి ఫలితముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే లక్ష్యాన్ని త్వరగా చేరవచ్చు. లక్ష్మీ కటాక్షం బ్రహ్మాండంగా ఉంది. స్వయంకృషి ఫలిస్తుంది. కీర్తి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈశ్వరారాధన ఉత్తమం.


ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఆశయం త్వరగా నెరవేరుతుంది. ఆనందించే అంశాలున్నాయి. ఇంట్లోవారితో చర్చించి తీసుకునే నిర్ణయాలతో మంచి ఫలితం వస్తుంది. ముఖ్య కార్యాల్లో చురుగ్గా ఉండండి. ఆర్థికవృద్ధి లభిస్తుంది. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.


అదృష్టయోగం ఉంది. విశేష ధన లాభం సూచితం. ఉద్యోగంలో గత వైభవం లభిస్తుంది. యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని సాధించండి. ప్రతికూలతలు తొలగుతాయి. మిత్రుల అండ లభిస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. వ్యాపారం బాగుంటుంది. పలు మార్గాల్లో కలిసొచ్చినా ఖర్చు కూడా పెరుగుతుంది. ఇష్టదైవాన్ని తలుచుకుంటే మంచిది.


ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవసరాలకు ధనం అందుతుంది. దైవబలంతో కార్యాలు పూర్తవుతాయి. ఆశించిన జీవితం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ధర్మమార్గంలో అభివృద్ధి సాధిస్తారు. మొహమాటాన్ని వదిలిపెట్టాలి. సున్నితమైన అంశాల్లో స్పష్టత అవసరం. ఇష్టదైవస్మరణ మేలుచేస్తుంది.


అదృష్ట యోగముంది. సకాలంలో పనిచేసి విజయం సాధించండి. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. కోరికలు వెంటనే తీరతాయి.  వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా పనులు త్వరగా జరుగుతాయి. వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడే చేయండి. మితంగా మాట్లాడాలి. సూర్య మంత్రాన్ని పఠించండి, అంతా శుభమే జరుగుతుంది.


అప్రమత్తత అవసరం. ముఖ్య కార్యాలను కొద్దికాలం వాయిదా వేయటం మంచిది. అనేక అవరోధాలున్నాయి. చిన్న పొరపాటు కూడా పెద్దది అవుతుంది. మొహమాటం పనికిరాదు. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. అపార్థాలకు అవకాశముంది. స్పష్టంగా మాట్లాడండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదవండి, మనోబలం లభిస్తుంది.


విశేష ధన లాభముంటుంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. మనోబలంతో మంచి ఫలితాలు సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఒక మెట్టు పైకి ఎక్కుతారు. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ఇష్టదేవతా దర్శనం మంచిది.


అనుకున్న పనులు సకాలంలో అవుతాయి. అద్భుతమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా కలిసి వస్తుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఇష్ట కార్యసిద్ధి ఉంది. అపోహలు తొలగుతాయి. చంచలత్వం పనికి రాదు. ఇష్టదేవతాస్మరణ ఉత్తమం.


అవసరాలకు ధనం అందినా శ్రమ అధికమవుతుంది. ఉద్యోగంలో స్పష్టతతో పనిచేయాలి. గందరగోళ స్థితి ఎదురుకాకుండా జాగ్రత్తగా సంభాషించండి. నిందారోపణలు చేసే వారున్నారు. ధర్మం రక్షిస్తుంది. తోటివారి సూచనలు అవసరం. పొరపాటు జరగకుండా చూడాలి. వ్యాపారంలో జాగ్రత్త. లలితా సహస్రనామం చదివితే మేలు.


అద్భుతమైన శుభకాలం మొదలైంది. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అభీష్టసిద్ధి కలుగుతుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఒక పనిలో త్వరగా విజయముంటుంది. మేలు చేసేవారున్నారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మంచి వార్తలు వింటారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.


ముఖ్య కార్యాల్లో విజయముంటుంది కానీ బాగా కష్టపడాలి. తెలియని ఆటంకాలున్నాయి, బుద్ధిబలంతో అధిగమించాలి. కుటుంబసభ్యుల సూచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడి పనికిరాదు. సకాలంలో పని మొదలుపెడితే మంచిది. ఆందోళన కలిగించే వారున్నారు. ధర్మదేవత సదా కాపాడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, అనుకున్న పని పూర్తవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..