weekly horoscope: రాశి ఫలం

గ్రహబలం ( మే 7 - 13 )

Updated : 07 May 2023 02:23 IST

weekly horoscope: రాశి ఫలం

గ్రహబలం ( మే 7 - 13 )


సకాలంలో పని పూర్తిచేయండి, మంచి ఫలితాలుంటాయి. శ్రద్ధ పెంచాలి. ధైర్యం చాలా అవసరం. లక్ష్యం పూర్తయ్యేవరకూ ఇతర పనుల్లో తల దూర్చవద్దు. తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. చంచలత్వం పనికిరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. అవసరాలకు ధనం అందుతుంది. సూర్య భగవానుణ్ణి దర్శించండి, విజయం వరిస్తుంది.


మనోబలంతో పనులు ప్రారంభించండి. తెలియని ఆటంకాలున్నాయి. సమయస్ఫూర్తి అవసరం. ధర్మమార్గంలో ముందుకెళ్తూ పనిలో నిమగ్నమవండి. లక్ష్యాన్ని చేరేవరకూ శ్రమించాలి. సహనం శక్తినిస్తుంది. మిత్రుల సహకారంతో ఒక విజయం లభిస్తుంది. వ్యాపారంలో సొంతనిర్ణయాలు ఫలితాన్నిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి, శుభవార్త వింటారు.


శుభఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. తలచిన కార్యాలు పూర్తవుతాయి. అనుభవంతో నిర్ణయాలు తీసుకోండి. తోటివారి సహకారం లభిస్తుంది. అద్భుతమైన వ్యాపారయోగం సూచితం. పలుమార్గాల్లో విజయా లుంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.


ఉద్యోగంలో బాగుంటుంది. స్థిర నిర్ణయాలు తీసుకోవాలి. అనుకున్నది సిద్ధించేవరకూ ప్రయత్నిస్తూనే ఉండాలి. పట్టుదల అవసరం. విజయం చేరువలోనే ఉంది. ప్రతిభతో విఘ్నాలను అధిగమించాలి. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి. సమయస్ఫూర్తి అవసరం. ఎవరిపైనా ఆధారపడవద్దు. ప్రతి పనీ ఇంట్లోవారికి చెప్పి చేయాలి. ఈశ్వర ధ్యానం కార్యసిద్ధినిస్తుంది.


ధైర్యంగా పనులు ప్రారంభించండి, కృషికి తగిన ఫలితం లభిస్తుంది. నిరంతర సాధనతో లక్ష్యాలను పూర్తిచేయండి. అదృష్టయోగం సూచితం. వెతుకుతున్నది దొరుకుతుంది. అనుభవజ్ఞుల సూచనలతో స్థిరమైన ఫలితాలను సాధించండి. భూగృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో కలిసివస్తుంది. దుర్గాదేవి స్మరణ శుభప్రదం.


మనోబలంతో ముందుకు సాగాలి. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడి లేకుండా సకాలంలో బాధ్యతలను పూర్తిచేయండి.సౌమ్యంగా సంభాషించాలి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. మిత్రుల సహకారం అవసరం. ఈర్ష్యతో నిందలు మోపేవారు ఉంటారు. ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించాలి. విష్ణు సహస్రనామ పారాయణం మంచిది.


ఉత్సాహంగా పనిచేయండి. గుర్తింపూ గౌరవం లభిస్తాయి. సకాలంలో పనులు పూర్తిచేయడం ద్వారా లక్ష్యం సిద్ధిస్తుంది. ఎదురుచూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. అదృష్టయోగం సూచితం. పెట్టుబడులు లాభిస్తాయి. శత్రుదోషం తొలగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, శుభవార్త వింటారు.


శుభకాలం. ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. అధికారులు ప్రసన్నులవుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి సూచితం. భూ గృహ వాహన యోగాలున్నాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. కుజగ్రహ శ్లోకం చదువుకోండి, ఆనందించే వార్తలు వింటారు.


సంకల్పం సిద్ధిస్తుంది. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. స్థిర నిర్ణయాలు శక్తినిస్తాయి. పట్టుదలతో పనిచేయండి. పనుల్ని వాయిదా వేయవద్దు. నమ్మకంగా పనిచేస్తే అవరోధాలు తొలగుతాయి.చంచలత్వం పనికిరాదు. ఆదిత్యహృదయం చదివితే మంచిది.


వ్యాపారం వృద్ధిచెందుతుంది. అదృష్టవంతులవుతారు. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవాలి. భూలాభం సూచితం. ఉద్యోగంలో శుభఫలితాలు సాధిస్తారు. శాంతంగా మాట్లాడితే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయడం ఆనందాన్నిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. ఈశ్వర ఆరాధన శుభప్రదం.


అదృష్టయోగం సూచితం. ఉద్యోగం బాగుంటుంది. సహనం కాపాడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల్ని బుద్ధిబలంతో పరిష్కరించాలి. ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి, కార్యసిద్ధి లభిస్తుంది.


విశేషమైన వ్యాపారలాభాలున్నాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాలతో అభీష్ట సిద్ధి కలుగుతుంది. ధనయోగం సూచితం. మిత్రుల సహకారం అందుతుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విఘ్నాలు తొలగుతాయి. ఇష్టదైవాన్ని దర్శించండి, అనుకున్నది జరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..