Weekly Horoscope: రాశిఫలం(అక్టోబరు 23 - 29)

వ్యాపారబలం అద్భుతం. పనిలో అజాగ్రత్త వద్దు. లక్ష్యంపై దృష్టి నిలిపి సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఆత్మవిశ్వాసం అవసరం. సంకోచం పనికిరాదు.

Updated : 23 Oct 2022 06:54 IST

Weekly Horoscope: రాశిఫలం(అక్టోబరు 23 - 29)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


వ్యాపారబలం అద్భుతం. పనిలో అజాగ్రత్త వద్దు. లక్ష్యంపై దృష్టి నిలిపి సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఆత్మవిశ్వాసం అవసరం. సంకోచం పనికిరాదు. సమష్టికృషితో అనుకున్న ఫలితం వస్తుంది. ఉద్యోగంలో పైఅధికారుల నుంచి ఇబ్బందులు రాకుండా పనిచేయాలి. ఆర్థికస్థితి సాధారణం. ఇష్టదేవతను స్మరించండి, మనోబలం లభిస్తుంది.


ఉద్యోగంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయాలి. అంతా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. అదృష్ట యోగముంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారంలో చంచల నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఇంట్లో శాంతి లభిస్తుంది. విష్ణుస్తుతి శక్తినిస్తుంది.


 

వ్యాపారబలం బ్రహ్మాండంగా ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. అధికారుల వల్ల ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. సున్నితాంశాలలో తొందరపడవద్దు.  ఆవేశం ఇబ్బందిపెడుతుంది. శాంతంగా, సకాలంలో పనులు పూర్తిచేయాలి. ఆంజనేయుడిని దర్శించండి, శుభవార్త వింటారు.


 

అనుకూల కాలం. ధర్మమార్గాన్ని అనుసరించాలి. బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులపై ఆధారపడవద్దు. స్వయంకృషితోనే పైకి వస్తారు. సొంత నిర్ణయం మేలుచేస్తుంది. గౌరవ పురస్కారాలు ఉన్నాయి. బాధ్యతలను సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. సూర్య అష్టకం చదవండి, ఫలితం ఉంటుంది.


ఉత్తమకాలమిది. శుభయోగం ఉంది. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. నిరంతర సాధన విజయాన్నిస్తుంది. కాలాన్ని వృథా చేయవద్దు. ఉద్యోగంలో విశేషమైన మేలు జరుగుతుంది. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి. ధనధాన్య లాభముంటుంది. ఇష్టదైవారాధన శ్రేష్ఠం.


ధర్మబద్ధంగా పని ప్రారంభించండి, శ్రేష్ఠమైన ఫలితం లభిస్తుంది. సాధనతోనే సమస్యని అర్థం చేసుకుని పరిష్కరించగలరు. చురుకైన ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారు. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. సూర్యదేవుడిని స్మరించండి, అభీష్ట సిద్ధి కలుగుతుంది.


సకాలంలో పని మొదలుపెడితే విజయం లభిస్తుంది. మిశ్రమకాలం. ఒత్తిడికి గురికావద్దు. ఎటుచూసినా ఆటంకమే గోచరిస్తోంది. గత అనుభవాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లోవారి సలహా అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. సత్ప్రవర్తనతో పెద్దలను మెప్పిస్తారు. వారాంతానికి శుభం జరుగుతుంది. నవగ్రహధ్యానం శ్రేయస్కరం.


అద్భుతమైన శుభయోగాలుంటాయి. ముఖ్యమైన పనుల్ని పూర్తి చేసుకోవచ్చు. సావధాన చిత్తులై బాధ్యతలను నిర్వహిస్తే కోరుకున్న విధంగానే లాభాలు పొందుతారు. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు వస్తాయి. కొందరివల్ల ప్రయోజనముంటుంది. ఉద్యోగంలో అప్రమత్తంగా, ఒత్తిడికి దూరంగా ఉండాలి. అదృష్ట యోగాలున్నాయి. ఇష్టదైవారాధన ఉత్తమం.


ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏ పని ఏ రోజు పూర్తికావాలో ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. సునాయాసంగా విఘ్నాలను అధిగమించగలుగుతారు. ఆవేశపరిచే పరిస్థితులు ఉంటాయి. ఓర్పు చాలా అవసరం. తృటిలో ఒక ఆపద నుంచి బయటపడతారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరిస్తే మంచిది.


ఉద్యోగంలో అనుకున్నది జరుగుతుంది. విశేషమైన కృషి అవసరం. ఎదురుచూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. సంశయాత్మకంగా ఏ పనీ చేయవద్దు. ధైర్యంగా ముందుకెళ్లాలి. ఒక సమస్య తొలగుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


ముఖ్యకార్యాల్లో విజయముంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన గుర్తింపును పొందుతారు. మిత్రుల వల్ల ఆపద తొలగుతుంది. తొందరలో పొరపాటు జరగనివ్వకూడదు. శాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మొహమాటం, అలసత్వం పనికిరావు. గృహయోగం సూచితం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శివారాధన మంచిది.


లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది. మంచి ఆలోచనలతో పని ప్రారంభించండి. శుభ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో కష్టపడాలి. ఆత్మవిశ్వాసం సడలరాదు. అధికారుల అండ లభిస్తుంది. సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. వ్యాపారంలో అధికశాతం లాభపడతారు. భవిష్యత్తు బాగుంటుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఇష్టదేవతాధ్యానం శుభప్రదం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..