స్వీట్లు ఎక్కువగా తింటుంటే...

స్వీట్లూ డెజర్ట్‌లూ చూస్తే ఆగలేకపోతున్నారా... పొట్ట నిండుగా ఉన్నా అవి తినాలని అనిపిస్తుందా... దానికి కారణం మీ పొట్టలోని బ్యాక్టీరియానే అంటున్నారు కాల్‌టెక్‌ శాస్త్రవేత్తలు.

Published : 18 Dec 2022 00:49 IST

స్వీట్లు ఎక్కువగా తింటుంటే...

స్వీట్లూ డెజర్ట్‌లూ చూస్తే ఆగలేకపోతున్నారా... పొట్ట నిండుగా ఉన్నా అవి తినాలని అనిపిస్తుందా... దానికి కారణం మీ పొట్టలోని బ్యాక్టీరియానే అంటున్నారు కాల్‌టెక్‌ శాస్త్రవేత్తలు. పొట్టలోని బ్యాక్టీరియానే అనేక రకాల వ్యాధులకు కారణం అని అనేక పరిశీలనలు చెబుతున్నాయి. ముఖ్యంగా బుద్ధిమాంద్యం, కుంగుబాటు, ఒంటరిగా ఉండటం... వంటి ప్రవర్తనాపరమైన లోపాలకు బ్యాక్టీరియానే కారణమని తేల్చారు. ఇప్పుడు తీపి ఎక్కువగా తినాలనిపించడానికి కూడా బ్యాక్టీరియానే కారణమని చెబుతున్నారు. ఈ విషయమై ఎలుకలపై చేసిన పరిశోధనలో భాగంగా- వరసగా కొన్ని ఎలుకలకు నాలుగు వారాలపాటు యాంటీబయోటిక్స్‌ను ఇచ్చినప్పుడు వాటి పొట్టలోని మైక్రోబయోమ్‌ వైవిధ్యంలో మార్పు కనిపించిందట. అంతేకాదు, అవి మిగిలిన ఎలుకలకన్నా తీపి వస్తువుల్ని ఎక్కువగా తినసాగాయట. కొన్ని రోజుల తరవాత వాటి పొట్టలోకి మళ్లీ అంతకుముందున్న మైక్రోబయోమ్‌ను ప్రవేశపెట్టినప్పుడు- అవి తీపి తినడం తగ్గించాయట. దీన్నిబట్టి మనుషుల్లో కూడా మైక్రోబయోమ్‌నును బట్టి చికిత్స చేయగలిగితే ఎన్నో రకాల శారీరక, మానసిక వ్యాధుల్నీ; ముఖ్యంగా ప్రవర్తనాపరమైiన లోపాల్నీ నివారించవచ్చనీ ఆల్కహాల్‌, ధూమపానం... వంటి అలవాట్లని కూడా మానిపించవచ్చనీ భావిస్తున్నారు. కాబట్టి ప్రతీ చిన్నదానికీ యాంటీబయోటిక్స్‌ను తీసుకుంటే- పొట్టలోని బ్యాక్టీరియా దెబ్బతినే ప్రమాదమూ ఉందని గ్రహించాలి అంటున్నారు పరిశోధకులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..