హహ్హహ్హ

ఓసారి భార్య తన భర్త ఫోన్‌ను చెక్‌ చేసింది. కాంటాక్ట్స్‌లో మిగతావన్నీ పేర్లతో ఉంటే ఒకటి మాత్రం ‘మై లైఫ్‌’ అని ఉంది. తన అనుమానం నిజమైందని తిట్టుకుంటూ చూస్తే అది తన నెంబరే. అయ్యయ్యో ఎంత అపార్థం చేసుకున్నానూ అనుకుని బాధపడుతూ భర్త మీద ఎంతో ప్రేమ చూపింది.

Published : 23 Oct 2022 00:24 IST

హహ్హహ్హ

ముందే ఊహించి...

సారి భార్య తన భర్త ఫోన్‌ను చెక్‌ చేసింది. కాంటాక్ట్స్‌లో మిగతావన్నీ పేర్లతో ఉంటే ఒకటి మాత్రం ‘మై లైఫ్‌’ అని ఉంది. తన అనుమానం నిజమైందని తిట్టుకుంటూ చూస్తే అది తన నెంబరే. అయ్యయ్యో ఎంత అపార్థం చేసుకున్నానూ అనుకుని బాధపడుతూ భర్త మీద ఎంతో ప్రేమ చూపింది. అన్నిటికీ సర్దుకుపోతూ గొడవ పడటమే మానేసింది. పాపం ఆమెకేం తెలుసు... రోజుకు పది కాల్స్‌ వెళ్లిన బాస్‌ పేరుతో ఉన్నదే ఆమె అనుమానించిన నెంబరని.


చూసినా ఆగలేదు!

భార్య: ఏమండీ పాలు పొంగకుండా చూడమన్నాను చూశారా...

వెంగళప్ప: చూశానోయ్‌. కానీ అదేంటో కన్ను ఆర్పకుండా చూసినా పొంగిపోయాయ్‌, ఎందుకలా?


అసలు ఎలా?

జడ్జి: నువ్వు మీ ఆవిడని భయపెట్టి, బెదిరించి చాలా కంట్రోల్‌లో పెట్టావంట... నిజమేనా?

సుబ్బారావు: సర్‌...అసలేం జరిగిందంటే...

జడ్జి: సంజాయిషీలు వద్దు. ఏం చెప్పి భయపెట్టావో చెప్పు చాలు.


బద్ధకం పోయింది

సుబ్బారావు: ఆ డాక్టర్‌ నిజంగా దేవుడే.. మా ఆవిడ బద్ధకాన్ని చిటికెలో పోగొట్టాడు తెలుసా...

ముత్యాలరావు: ఎలా?

సుబ్బారావు: వయసు పెరుగుతోంది కదమ్మా... అన్నాడంతే. ఆ మర్నాటి నుంచి అన్ని పనులు తనే చకచకా చేసేస్తోంది.  


అందుకే తాగాను

భార్య: కారణం లేకుండా తాగనన్నారు... మరి ఇవాళ ఏ కారణంతో తాగి వచ్చారు.

భర్త: దీపావళి వస్తోంది కదా... అందుకే తాగాను.

భార్య: పండగకీ.. మీరు తాగడానికీ సంబంధం ఏంటో...

భర్త: పిల్లలు రాకెట్‌ కాల్చడానికి సీసా కావాలి కదా... అందుకని.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..