సీసాలో చిత్రం... ఎంత విచిత్రం!

కుంచె పట్టుకుని హరివిల్లు రంగులు అద్దుతూ సీసామీద అందమైన రూపాన్నో, అపురూపమైన సన్నివేశాన్నో చక్కని చిత్రాలుగా గీయడం అన్నది చాలామంది ఆర్టిస్టులకు తెలిసిన కళ కావొచ్చు. కానీ అదే

Published : 29 May 2022 00:31 IST

సీసాలో చిత్రం... ఎంత విచిత్రం!

కుంచె పట్టుకుని హరివిల్లు రంగులు అద్దుతూ సీసామీద అందమైన రూపాన్నో, అపురూపమైన సన్నివేశాన్నో చక్కని చిత్రాలుగా గీయడం అన్నది చాలామంది ఆర్టిస్టులకు తెలిసిన కళ కావొచ్చు. కానీ అదే పెయింటింగ్‌ను సీసాలోపల వేయడమనేది అసలు ఊహించగలమా... ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలన్నీ అలా వేసినవే. ‘ఇన్నర్‌ పెయింటింగ్‌, ఆర్ట్‌ ఇన్‌ బాటిల్‌’ పేర్లతో పిలిచే ఈ అరుదైన కళ ఇప్పుడు మన దగ్గరా కనిపిస్తున్నా ఇది పుట్టింది మాత్రం చైనాలో. 19వ శతాబ్దం మొదట్లో చైనాలో ముక్కుపొడిని(నశ్యం) దాచుకోవడానికి బాటిళ్లను వాడేవారట. గాలి లోపలికి వెళ్లకుండా ప్రత్యేకంగా ఉండే ఈ సీసాల్ని అందంగా కనిపించడానికి ఆర్ట్‌తో తీర్చిదిద్దేవారట. కొన్నాళ్ల తర్వాత ‘వేసే ఆ ఆర్ట్‌ ఏదో సీసా లోపలైతే చెరిగిపోకుండా ఉంటుందేమో’ అనుకుంటూ సీసాలోపల ఇలా చూడముచ్చటైన చిత్రాలు గీయడం మొదలుపెట్టారట. కానీ సీసాలోపల చిత్రించడం అంటే సాధారణమైన విషయమా... అందుకే ఈ ఆర్ట్‌సీసాల్ని చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతుంటారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..