అందాల సరస్సులో... అర చక్రాల ఇళ్లు

నీటిపైన అర్ధచంద్రాకారాల్లో పదుల సంఖ్యలో పరుచుకున్న ఈ ఇళ్ల ఫొటోలను చూడగానే ‘అరె ఏ ఊరబ్బా గమ్మత్తుగా ఉందీ చోటు’ అనేస్తారు ఎవరైనా సరే. నీటిపైనే ఒకవైపు కారు ప్రయాణాలూ, మరోవైపు పడవ ప్రయాణాలూ చేసేలా నిర్మించిన ఈ ఇళ్లు ఉన్నది నెదర్లాండ్స్‌లోని లెమర్‌ అనే పట్టణంలో.

Updated : 07 Aug 2022 06:36 IST

అందాల సరస్సులో... అర చక్రాల ఇళ్లు

నీటిపైన అర్ధచంద్రాకారాల్లో పదుల సంఖ్యలో పరుచుకున్న ఈ ఇళ్ల ఫొటోలను చూడగానే ‘అరె ఏ ఊరబ్బా గమ్మత్తుగా ఉందీ చోటు’ అనేస్తారు ఎవరైనా సరే. నీటిపైనే ఒకవైపు కారు ప్రయాణాలూ, మరోవైపు పడవ ప్రయాణాలూ చేసేలా నిర్మించిన ఈ ఇళ్లు ఉన్నది నెదర్లాండ్స్‌లోని లెమర్‌ అనే పట్టణంలో. సముద్రం పక్కనే ఉన్న లేక్‌ ఐజెస్సెల్‌, ఫ్రిషియన్‌ సరస్సుల్ని ఆనుకుని ఉన్న ఈ పట్టణంలో ఇళ్ల నిర్మాణాలన్నీ చాలావరకూ ఇలా నీటి మీదే ఉంటాయి. వాటిలోనే ఇంకాస్త వైవిధ్యం చూపిస్తూ పర్యటకుల కోసం ‘బ్రోకెన్‌ వీల్‌’ పేరుతో వీటిని నిర్మించారు. ఆకాశం నుంచి చూస్తే సగం విరిగిన చక్రాల్లా కనిపించే ఇళ్ల ఆకృతుల వల్లే ఆ పేరు పెట్టారు. విశాలమైన గదులూ... పచ్చని పార్కులూ... ఇలా సకల సౌకర్యాలతో ఉంటాయివన్నీ కూడా.  మరి మీరే చెప్పండి... సరస్సులపైన భూతల స్వర్గంలా ఉన్న ఈ ఇళ్లలో ఉండాలనుకునే సందర్శకులు ఈ పట్టణానికి రాకుండా ఉంటారా... ఇక్కడ ఓ పూట గడపకుండా వెళతారా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..