గాయాలకు గింజల జిగురు!
ఏ రకం జిగురైనా చెట్టు కాండానికి గాయమైనప్పుడే విడుదలవుతుంది. అయితే మిసెల్టోయ్ అనే ఓ మొక్కకి కాసే పండ్లలోని గింజలకి బంకలాంటి జిగురు ఉంటుంది. దీన్నే విసిన్ అంటారు. సాధారణంగా ఈ మొక్క చెట్ల కాండాలమీద పెరుగుతుంది. దీనికి కాసే పండ్లని పక్షులు తింటుంటాయి. వాటిని తినేటప్పుడు ఆ గింజల చుట్టూ ఉన్న జిగురు వల్ల అవి వాటి ముక్కుకీ ఈకలకీ అతుక్కుపోతుంటాయి. దాంతో ఆ పక్షులు వాటిని వదిలించుకునేందుకు తమ ముక్కునీ రెక్కల్నీ చెట్ల కాండాలకు రుద్దుకున్నప్పుడు అవి అక్కడ అతుక్కుని మళ్లీ అక్కడ మొలకెత్తుతుంటాయి. అయితే కెనడాకి చెందిన మెక్‌గిల్ యూనివర్సిటీకి చెందిన మాథ్యూ హారింగ్టన్ అనే ప్రొఫెసర్, ఒకసారి తన కూతురు ఆ జిగురు గింజలతో ఆడుతున్న దృశ్యాన్ని చూశాడట. అంత బంకగా ఉన్న ఆ పదార్థాన్ని మానవాళి ప్రయోజనాలకి వాడితేనో అని స్ఫురించింది. వెంటనే మరికొందరితో కలిసి అందులోని సెల్యులోజ్ నానోఫైబర్‌లను వేరుచేసి, వాటిని పలుచని పొరలా తయారుచేసి లోహం, ప్లాస్టిక్, గాజు, మానవ చర్మం, కణజాలాలకు అతికించి చూడగా- వెంటనే అతుక్కుపోయిందట. ఆ తరవాత గాయంమీద అతికించినప్పుడూ అది మరింత పెద్దది కాకుండా తగ్గిపోయిందట. దాంతో ఈ గింజల జిగురులోని సెల్యులోజ్‌ని గాయాల నివారణలో ఉపయోగించే ఆలోచనలో ఉన్నారు సదరు పరిశోధకులు.
బ్యాటరీలు మరింత సమర్థంగా!
సాధారణంగా రీఛార్జ్‌బుల్ ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటికీ లిథియం అయాన్ బ్యాటరీలనే వాడతారు. ఇవి ఎక్కువ శక్తిని గ్రహించడంతోపాటు దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటాయి. వాతావరణ ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు- అంటే, శీతల వాతావరణంలో వాటి పనితీరు మందగిస్తుంది. అందుకే సెల్ఫోన్లని తరచూ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ కార్లు కూడా కొద్ది దూరానికే బ్యాటరీ అయిపోతుంటాయి. దీనికి కారణం అలాంటి వాతావరణంలో లిథియం అయాన్ బ్యాటరీలోని గ్రాఫైట్‌తో చేసిన యానోడ్లు మందకొడిగా పనిచేస్తాయి. దాంతో అవి త్వరగా ఛార్జ్ కావు సరికదా, ఉన్న ఛార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. అందుకే లిథియం బ్యాటరీలోని గ్రాఫైట్‌ని మార్చి దానికి బదులుగా కొబాల్ట్తో కూడిన జియోలైట్ ఇమిడాజొలేట్ను చొప్పించినప్పుడు- అవి మైనస్ 31 డిగ్రీల దగ్గరా చక్కగా ఛార్జ్ అయ్యాయట. ఈ పరిశోధన ఆధారంగా- బ్యాటరీలు మరింత సమర్థంగా పనిచేసేందుకు తయారీలో మార్పులు చేయనున్నారట.
చీకట్లోనూ మొక్కలు పెరిగేలా!
మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి ఆహారాన్ని తయారుచేసుకుంటాయనేది తెలిసిందే. దీన్నే కిరణజన్యసంయోగక్రియ లేదా ఫొటోసింథసిస్ అంటారు. మున్ముందు సూర్యుడితో పనిలేకుండా మొక్కలు చీకట్లోనూ ఆహారాన్ని తయారుచేసుకోగలిగే ఎలక్ట్రో కేటలిటిక్ అనే కృత్రిమ విధానాన్ని రూపొందించారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. ఈ రకమైన హైబ్రిడ్ విధానంతో పంటల్ని 18 శాతం ఎక్కువగా పండించవచ్చట. అందులో భాగంగా అవి విద్యుచ్ఛక్తి సాయంతో నీటితోనూ కార్బన్డైఆక్సైడ్తోనూ చర్యపొంది వాటిని ఎసిటేట్ పదార్థంగా మార్చుకోవడం ద్వారా ఆహారాన్ని ఉత్పత్తిచేసుకోవడమే కాదు, అవి చీకట్లోనూ చక్కగా పెరిగాయట. ఇందుకోసం సోలార్‌ప్యానల్స్ ద్వారా గ్రహించిన సౌరశక్తినే విద్యుచ్ఛక్తిగా వాడుతున్నారు. కరవుకాటకాలూ వరదలూ పంట భూములు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కృత్రిమ ఫొటోసింథసిస్ పద్ధతిని ఉపయోగించి ఆహార ఉత్పత్తులను ఎక్కువగా పండించవచ్చు అని భావిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా నగరాల్లోని భవనాల్లోనే వ్యవసాయాన్ని చేయవచ్చు అంటున్నారు.
దుస్తులే విద్యుచ్ఛక్తిని తయారుచేస్తే!
మీ దుస్తులే విద్యుచ్ఛక్తిని తయారుచేసే రోజు ఎంతో దూరంలో లేదు అంటున్నారు సింగపూర్‌కి చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నిపుణులు. ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం ద్వారా వెచ్చగానూ చల్లగానూ ఉండే వేరబుల్ ఎలక్ట్రానిక్ క్లోత్స్ గురించే ఇప్పటివరకూ విన్నాం. కానీ ఇకనుంచి మనం ఒంటిమీద వేసుకున్న దుస్తులే మన కదలికల నుంచి విద్యుచ్ఛక్తిని తయారుచేసేస్తాయట. ఇందుకోసం సంబంధిత నిపుణులు అనేకసార్లు ప్రయత్నించి ఎట్టకేలకు ఓ సరికొత్త ఫ్యాబ్రిక్కుని తయారుచేశారట. సాగేగుణంతోపాటు వాటర్ప్రూఫ్గానూ పనిచేసే ఎస్ఈబీఎస్ అనే ఓ ప్రత్యేకమైన రబ్బరు లాంటి పదార్థాన్ని తీసుకుని దాన్ని ఎలక్ట్రోడ్లుగా మార్చారట. ఆ తరవాత దానికి పీవీడిఎఫ్-హెచ్‌పీఎఫ్... వంటి పదార్థాలు జోడించి ఫ్యాబ్రిక్కుగా రూపొందించారట. ఆపై ఈ క్లాత్‌ను టీ-షర్టు మోచేతుల దగ్గరా ప్యాంటు మోకాళ్ల దగ్గరా, అలాగే షూ సోల్స్లోనూ చొప్పించారట. మొత్తమ్మీద ఈ ఫ్యాబ్రిక్‌కు ద్వారా చదరపు మీటరుకి 2.34 వాట్స్ ఎలక్ట్రిసిటీని తయారుచేయవచ్చు అంటున్నారు. అందులోభాగంగా సుమారు 4 సెం.మీ. ఫ్యాబ్రిక్కుని తీసుకుని, చేత్తో తడుతూ దాన్నుంచి వెలువడే విద్యుచ్ఛక్తితో వంద ఎల్ఈడీల్ని వెలిగించగలిగారట. పైగా ఇది ఉతికిన తరవాత కూడా అంతే చక్కగా పనిచేసిందట. సో, మున్ముందు మన బట్టల నుంచే మొబైల్నీ ఛార్జ్ చేసుకోవచ్చన్నమాట
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
కవర్ స్టోరీ
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
-
World News
Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
-
India News
I-Day: స్వాతంత్య్ర వేడుకల వేళ పంజాబ్‌లో ఉగ్రముఠా కుట్రలు భగ్నం!
-
Sports News
Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
-
Viral-videos News
Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
-
General News
Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Crime News: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
- Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్.. ఝున్‌ఝున్‌వాలా చెప్పిన విజయసూత్రాలివే!
- Social Look: మహేశ్‌బాబు స్టైలిష్ లుక్.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్‌లో నయన్!