Published : 02 Jan 2022 00:13 IST

సైన్యంలోకి వెళ్లాలనుకున్నా!

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టే కార్యక్రమాలూ, నిర్వహించే సమావేశాల గురించి ఎప్పటికప్పుడు పత్రికలూ, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉంటుంది. మరి ఆయన జీవనవిధానం, ఆహారపుటలవాట్లూ, అభిరుచులూ... వంటివే కాదు... ఆయన జీవితంలో మధుర జ్ఞాపకాలుగా చెప్పుకునే మరికొన్ని విషయాల గురించీ చదివేద్దామా..


ఆ రోజులు చాలా ఇష్టం

వాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో మాకు టీకొట్టు ఉండేది. మా నాన్నకు సాయంగా నేను కూడా ఆ టీకొట్టు దగ్గరకు వెళ్లేవాడిని. అవి భారత్‌-పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరుగుతున్న రోజులు. మా స్టేషన్‌లో ఆగిన రైల్లో మన సైనికులు ఉన్నారని తెలిస్తే... పరుగెత్తుకుంటూ వెళ్లి వాళ్లందరికీ టీ ఇచ్చి, సెల్యూట్‌ కొట్టడం నాకు ఇప్పటికీ గుర్తే. ఆ రోజులు మళ్లీ రావు.


రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే...

సైన్యంలోకి వెళ్లేవాడిని. అవును... చిన్నప్పటినుంచీ నేను సైన్యంలోకి వెళ్లాలని అనుకునేవాడిని. అందుకోసమే జామ్‌నగర్‌లోని సైనిక్‌స్కూల్లోనూ చేరాలనుకున్నా కానీ డబ్బులు లేక ఆ కోరికను వదిలేసుకున్నా.


సన్యాసిని కావాలనుకున్నా

చిన్నప్పటినుంచీ నేను సన్యాసిని కావాలనుకున్నా. అందుకే కొన్నాళ్లు దేశసంచారం చేశా.ఓ రెండేళ్లు హిమాలయాల్లోనూ ఉన్నా. ఆ ప్రయాణంలో ధ్యానం, ఆధ్యాత్మికత వంటివాటి గురించి తెలుసుకున్నా. అవన్నీ నాకు ఇప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతూనే ఉన్నాయి.


మొసలితో సావాసం

స్కూల్లో చదువుతున్నప్పుడు ఓసారి మొసలి పిల్లను ఇంటికి తెచ్చా.. దాన్ని చూసి అందరూ భయపడ్డారు కానీ నేను మాత్రం దాన్ని అలాగే చేతుల్లో పట్టుకున్నా. చివరకు ఇంట్లోవాళ్లు తిట్టడంతో వదిలేయాల్సి వచ్చింది. అదేవిధంగా మా ఊళ్లో ఓ చెరువు ఉండేది. అందులో నలభైవరకూ మొసళ్లు ఉండేవని చెప్పుకునేవారు. ఆ చెరువు దగ్గరకు వెళ్లేందుకు తోటిపిల్లలు  భయపడేవారు  కానీ... నేను మాత్రం ధైర్యంగా ఈదుకుంటూ అవతలి గట్టు దగ్గరకు వెళ్లిపోయేవాడిని.


బూట్లు ఉండేవి కావు

దువుకునేటప్పుడు నాకు బూట్లు కూడా ఉండేవి కావు. రోజూ స్కూలుకు అలాగే వెళ్లవాడిని. నా పరిస్థితిని అర్థంచేసుకున్న మా బంధువు ఒకాయన చివరకు నాకు వైట్‌ కాన్వాస్‌షూస్‌ని కొనిచ్చాడు. నేనేమో వాటినెప్పుడూ తెల్లగా ఉంచుకునేందుకు... స్కూల్‌ అయిపోయాక... కిందపడిన చాక్‌పీస్‌ ముక్కలన్నింటినీ ఏరుకుని తెచ్చుకుని వాటికి రుద్దుకునేవాడిని.


వీసాను తిరస్కరించారు

కటి కాదు, రెండు కాదు... అమెరికా చాలాసార్లు నా వీసాను తిరస్కరించింది. ఎందుకో తెలుసా... గుజరాత్‌ అల్లర్లలో నా పాత్ర కూడా ఉందని వాళ్లు భావించడమే అందుకు కారణం. ఆ తరువాత అమెరికానే నన్ను ప్రధానమంత్రిగా తమ దేశానికి ఆహ్వానించిందనుకోండీ...


నిద్ర ఉండదు

మావేశాలూ, ఇతర కార్యక్రమాల కారణంగా నేను రాత్రి పడుకునే సమయం చాలా తక్కువ. అయితే... మర్నాడు ఆ అలసట కనిపించకుండా ఉండేందుకే రోజూ యోగా, ప్రాణాయామం, శ్వాస సంబంధ వ్యాయామాలను చేస్తుంటా. అవే నన్ను రోజంతా చురుగ్గా ఉంచుతాయి.  


దుర్గమ్మ భక్తుణ్ణి

నేను మొదటినుంచీ దుర్గాదేవిని ఆరాధిస్తా. అందుకే దసరా సమయంలో తొమ్మిదిరోజులూ ఉపవాసం ఉంటా. ఆ రోజుల్లో ఏ దేశంలో ఉన్నా సరే... ఉపవాసాన్ని మాత్రం వదలను.


అభిరుచులు

పుస్తకపఠనం, ఫొటోగ్రఫీ, కవిత్వం రాయడం. చిన్నప్పటినుంచీ కవితలు రాసేవాడిని. సాక్షిభవ్‌, తహుకే వసంత్‌, గే అనో గర్బో వంటి పుస్తకాలూ రాశా.


ఇష్టమైన ఆహారం

కిచిడీ... ఖాండ్‌వీ, ఢోక్లా ఉంటే చాలు.


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని