Published : 03 Apr 2022 02:20 IST

సిల్లీ పాయింట్‌

విశ్వంలో ‘55 కాంక్రి’ అన్న గ్రహం ఉంది. భూమిపైన మట్టీ నీరూ ఉన్నటే... అందులో నేలంతా వజ్రంతో నిండి ఉంటుంది. రాకెట్లో మనం ఎంత వేగంగా వెళ్లినా సరే... అక్కడికి చేరుకోవడానికి మూడులక్షల సంవత్సరాలు పడతాయి!

* ఆవులూ, గుర్రాలూ, జింకలూ... అవసరమైతే మాంసం కూడా తినగలవు.

* మన ఊపిరితిత్తుల్లో... ఎడమవైపుది కుడివైపుదానికన్నా చిన్నది.

* ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌ పెళ్ళికాక ముందు కారు మెకానిక్‌గా పనిచేశారు!

* టైప్‌ చేసేటప్పుడు టకటకా శబ్దం వస్తుంటుంది కదా! ఆ టైప్‌రైటర్‌ శబ్దాలతో సంగీతం సృష్టించే బృందం ఒకటి అమెరికాలో ఉంది. బోస్టన్‌ టైప్‌రైటర్‌ ఆర్కెస్ట్రా అన్న ఈ బృందం సభ్యులు ఆ మధ్య ఓ ఆల్బమ్‌ కూడా తెచ్చారు.

* మామూలుగా ఏ టెన్నిస్‌ పోటీ అయినా దాదాపు గంటసేపు జరుగుతుంది. కానీ 2010లో జాన్‌ ఇస్నెర్‌-మహూత్‌ మధ్య జరిగిన వింబుల్డన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీ ఏకంగా 11.05 గంటలు సాగింది.

* ప్రతిక్షణం... ప్రపంచంలో ఎక్కడోచోట 2000 వేల పిడుగులు పడతాయట!

* కెచప్‌ని 18వ శతాబ్దం ఆరంభం వరకూ కడుపునొప్పి మందుగానే వాడేవారు.

* ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌కి కలర్‌బ్లైండ్‌నెస్‌ సమస్య ఉంది... ఎరుపు, పచ్చ రంగులు కనిపించవు.

* ఏనుగులు తమ గుంపులో చనిపోయినవాటిని ఖననం చేసి, ఆకుల్తో కప్పెడతాయి!

* షాంపెయిన్‌ మద్యాన్ని... 20వ శతాబ్దం ఆరంభంలో షూ పాలిష్‌గానూ వాడేవారట.

* ఇంగ్లిషులో ‘గ్రూప్‌ నౌన్స్‌’ ఉంటాయని విని ఉంటారు. చేపల గుంపుని ‘స్కూల్‌’ అనీ, సింహాల సమూహాన్ని ‘ప్రైడ్‌’ అనీ రకరకాలుగా పిలుస్తారు. ఆ వరసలో కాకుల గుంపుని ‘మర్డర్‌’ అంటారు.

* అమెరికా అధ్యక్షుడి భవనం వైట్‌హౌస్‌ బేస్‌మెంట్‌లో... పూల దుకాణం ఉంటుంది. భవనంలో జరిగే కార్యక్రమాలకి అవసరమైన పూలని అందులోనే కొనాలన్నది అక్కడ రూలు!

* భారత తూర్పు సముద్రతీరంలో సగానికిపైగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటుంది.

* నాడీ జ్యోతిషానికి ప్రసిద్ధిచెందిన తమిళనాడులోని వైదీశ్వరన్‌కోయిల్‌లో భక్తులకి ప్రసాదంగా... పునుగు నూనెను ఇస్తారు!

* వంకాయ రంగు, పెసర రంగు, కృష్ణనీలం... ఇలా మనకు తెలిసినవాటి పేర్లనే రంగులకి పెడతాం కదా! ఆరెంజ్‌ అన్నది ముందు రంగుగానే ప్రజల వాడుకలో ఉండి... ఆ తర్వాత ఆ పేరును పండుకి పెట్టారు!


ఆరుద్రపురుగు జాతిలో... మొత్తం మూడు లక్షల రకాలున్నాయి. ప్రపంచంలో అంత పెద్ద ‘బంధువర్గం’ ఉన్న జీవి మరొకటి లేదు!

* అదేమిటోకానీ... దక్షిణ అమెరికా దేశాల్లో కొంగజాతి లేదు. అంతేకాదు, ఏ కొంగలూ అక్కడికి వలస వెళ్లవు!


రెండువేలమంది శిశువుల్లో ఒకరికి... పుట్టుకతోనే పళ్లుంటాయి!


సూర్యుడి చుట్టుకొలత ఎంత పెద్దదంటే... అందులో పదిలక్షల భూగోళాలని పెట్టొచ్చు!


బార్బరా మిలీసెంట్‌ రాబర్ట్‌... ఈమె ఎవరా అనుకుంటున్నారేమో... బార్బీ బొమ్మ పూర్తిపేరు ఇదే!


నెదర్లాండ్స్‌ పోలీసుల జీపులో ఎప్పుడూ టెడ్డీబేర్‌ బొమ్మలుంటాయి. నేరాల విచారణలో భాగంగా పిల్లలతో మాట్లాడాల్సి వస్తే ఆ బొమ్మల్ని వాళ్ళకి ఇస్తారట.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts