Published : 08 May 2022 01:17 IST

సిల్లీపాయింట్‌

విక్టోరియా క్రౌన్డ్‌ పావురం... ప్రపంచంలోకెల్లా పెద్దదీ, అందమైనదీ కూడా.


మగవారిలో బట్టతలకి కారణమైన... డీహైడ్రో టెస్టాస్టిరాన్‌ (డీహెచ్‌టీ) అన్న హార్మోన్‌ వారసత్వంగా వస్తుంది. కాకపోతే ఆ వారసత్వం వచ్చేది తండ్రి నుంచి కాదు... తల్లి నుంచి!

* గంగా నదిలోని డాల్ఫిన్లు... చూడలేవు. కేవలం అల్ట్రాసౌండ్‌ తరంగాలని పంపించి, వాటి ప్రతిధ్వని ద్వారానే ఎదుట ఉన్న జీవుల్ని పసిగడతాయి. ప్రపంచంలో ఇలా చేసే డాల్ఫిన్‌ జాతి ఇదొక్కటే.

* 1975లో నెల్సన్‌ వాంగ్‌ అన్న చైనామూలాలున్న భారతీయ పాకశాస్త్ర నిపుణుడు తాను కనిపెట్టిన కొత్త వంటకానికి ఏం పేరుపెట్టాలో తెలియక... మంచూరియా అనేశాడు. నిజానికి... మంచూరియా అంటే రష్యా సరిహద్దుల్లోని ఈశాన్య చైనా భూభాగం... దానికీ ఈ వంటకానికీ ఏ సంబంధమూ లేదు.

* మనిషి రక్తమే ఆహారంగా బతుకుతాయి నల్లులు. ఒక ఆడ నల్లి వేల నల్లులకు జన్మనిస్తుంది. ఆహారం లేకుండా ఇది నెల రోజులైనా బతకగలదు.

* 1960లో ఆల్బర్ట్‌ హిచ్‌కాక్‌ సినిమా ‘సైకో’ వచ్చేదాకా... సినిమాల్లో వాష్‌రూమ్‌ని చూపించడం అసభ్యకరమని భావించేవారు.

* బ్రిటిష్‌వాళ్లు వచ్చాకే మన విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా వేసవి సెలవులు మొదలయ్యాయి. అదివరకు, ఏడాది మొత్తం చదువులే మనకి!

* కోల్‌కతా నగరంలోని బస్టాపుల్లో మీ కారో బైకో నిలపడం... శిక్షార్హమైన నేరం.

* ఐస్‌ ల్యాండ్‌లో వెయిటర్లు టిప్పు తీసుకోవడాన్ని అవమానంగా భావిస్తారు.

* మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు 268 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. 


సూర్యుడు తూర్పున ఉదయించింది మొదలు సాయంత్రం అస్తమించే వరకూ పొద్దుతిరుగుడు అటువైపే చూస్తుంది. దీనికి కారణం ఈ మొక్కలో ఉండే ఫొటోట్రాపిజం అనే లక్షణం. అంటే కంటికి కనిపించే సూర్యరశ్మి వల్ల తక్షణం కలిగే ప్రతిస్పందన. పొద్దు తిరుగుడు మొక్క కాండంలో ఉండే ఆక్సిన్‌ అనే హార్మోన్‌ ఈ స్పందన కలిగిస్తుంది. ఇది మొక్క ఎదుగుదలలో కీలకంగా పనిచేస్తుంది.


పిల్లులు రాత్రి పూట మనిషి కంటే ఆరు రెట్లు మెరుగ్గా చూడగలవు. ఎందుకంటే వాటి కళ్లపైన టెపేటం లూసిడమ్‌ అనే కాంతిని గ్రహించే అదనపు పొర ఉంటుంది.


చీమలు నిద్రపోవు. వీటికి ఊపిరితిత్తులు కూడా ఉండవు. శరీరంపై ఉండే చిన్న రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుని వాటి ద్వారానే కార్బన్‌డయాక్సైడ్‌ని వదులుతాయి.


ప్రపంచంలో అతిపెద్ద హైస్పీడ్‌ రైల్వే వ్యవస్థ చైనాలో ఉంది. సుమారు 25 వేల కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంటుందిది.


టైలర్‌ బట్టలు కుట్టినట్లుగా ఆకుల్ని కుట్టి గూడు కట్టుకుంటుంది ఓ పక్షి. దీని పేరు కామన్‌ టైలర్‌ బర్డ్‌. గుబురుగా ఆకులు ఉండే చెట్టుని ఎంచుకుని ఆ ఆకులపై వరుసగా చిన్న చిన్న రంధ్రాలు చేసి సాలెగూడు దారంతో గూడులా అల్లేస్తుంది.


బేబీ ట్యాక్సీ, టుక్సీ, ఈజీ బైక్‌, టుక్‌ టుక్‌, బవోబవో, పీజియన్‌... ఏమిటివన్నీ అనుకుంటున్నారేమో... వివిధ దేశాల్లో ఆటోరిక్షాలకు ఉన్న పేర్లు ఇవి!Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని