సిల్లీపాయింట్
ఈమూ పక్షులకి వెనక్కి నడవడం రాదు! పర్వతాల్లో పుట్టే మంచు చుక్క (మౌంటెయిన్ డ్యూ), వెన్నెల (మూన్‌షైన్), అగ్గినీళ్ళు(ఫైర్ వాటర్)... ఇంగ్లిషు భాషలో అక్రమ సారాకున్న పేర్లలో కొన్ని ఇవి!
సిల్లీపాయింట్
ఈమూ పక్షులకి వెనక్కి నడవడం రాదు!
పర్వతాల్లో పుట్టే మంచు చుక్క (మౌంటెయిన్ డ్యూ), వెన్నెల (మూన్‌షైన్), అగ్గినీళ్ళు(ఫైర్ వాటర్)... ఇంగ్లిషు భాషలో అక్రమ సారాకున్న పేర్లలో కొన్ని ఇవి!
* నైజీరియాలో మన ‘అల్ఫాన్సో’ లాంటి మామిడి రకం ఒకటి పండుతుంది. ఈ రకాన్ని వాళ్ళు కిరోసిన్ అంటారు. ఆ పండుని తిన్నాక కొద్దిగా కిరోసిన్ వాసన వస్తుంది కాబట్టి... ఈ పేరట!
* గాయపడ్డవాళ్ళకో ఆపరేషన్ అవసరమైనవాళ్ళకో ఇప్పుడు రక్తాన్ని ఎక్కిస్తున్నట్టు... 19వ శతాబ్దం నాటి అమెరికాలో క్షయ, కలరా బాధితులకి మేక పాలని ఎక్కించేవారట!
ఎత్తైన పర్వతాల నుంచైనా డూప్‌లేకుండా ఇట్టే దూకేసే స్టంట్ సూపర్‌స్టార్ జాకీచాన్‌కి ‘ట్రైపోఫోబియా’ ఉంది. అంటే ఏమిటీ అంటారేమో... సిరంజిలంటే భయంతో వణికిపోవడం!
హైతీలో ఒకప్పుడు కొన్ని సంప్రదాయ మూలికల్ని ఉపయోగించి బతికున్నవాళ్ళని ఇంచుమించు చనిపోయిన స్థితికి తెచ్చేవారు!
వాళ్ళని ఖననం చేశాక, మళ్ళీ తీసి- ఆలోచన అన్నదే కోల్పోయినవాళ్ళని బానిసలుగా చేసుకునేవారట. ఇదేదో మాయలూ మంత్రాల కథ కాదు... దీన్ని నిషేధిస్తూ 1864లో అక్కడి ప్రభుత్వం చట్టం కూడా తెచ్చింది! అలా చచ్చి-బతికినవాళ్ళనే ‘జాంబీ’లు అనేవాళ్ళు!
చైనా, ఫ్రాన్స్... ఈ రెండు దేశాలూ ఇప్పటికీ పావురాళ్లని రహస్య వేగులుగా వాడుతున్నాయి! ఇందుకోసం వాటి సైన్యంలో ప్రత్యేక విభాగాలూ ఉన్నాయి.
* కేరళ యువతలో దాదాపు 9.8 శాతం మందికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వచ్చు. మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువమంది ప్రోగ్రామర్స్ లేదంటోంది ఇటీవల నిర్వహించిన సర్వే ఒకటి!
* అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని న్యూటన్ అన్నది ఓ చిన్న పట్టణం. అక్కడ ఓ వ్యక్తి మద్యం కొనాలంటే... అందుకు అనుమతిస్తూ అతని భార్య రాసిన లేఖ చూపించాలనే చట్టం ఉంది.
* సాధారణంగా, వాంతి చేసుకునేటప్పుడు పొట్టలోని యాసిడ్ కొద్దిగా బయటకు వస్తుంటుంది. ఆ ఆమ్లం నేరుగా వచ్చి నోటిని తాకితే అప్పటికప్పుడు మన నాలుకా పళ్ళూ దెబ్బతింటాయట. అలా కాకూడదనే... వాంతి ముందు నోట్లో విపరీతంగా నీళ్ళూరుతాయి!
చిలేలో అగ్నిమాపక శాఖ అంటూ ప్రత్యేక వ్యవస్థ ఉండదు. ప్రజలే కార్యకర్తలుగా ఏర్పడిన సంఘమొకటి దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుంది. ఇందుకోసం వాళ్ళు జీతభత్యాలేవీ తీసుకోరు!
కెనడాలో మంచు వర్షం రావడానికి కాస్త ముందు... రహదారులపైన బీట్‌రూట్ జ్యూస్ చల్లుతారు. మంచు గడ్డకట్టి రోడ్డుకి అతుక్కుపోకుండా ఇలా చేస్తారట!
* ఐఫోన్‌లో ఉపయోగించే ‘ఫేస్ ఐడీ’... మాస్క్ వేసుకున్నా గుర్తిస్తుంది కానీ... నల్లకళ్ళజోడు పెట్టుకుంటే మాత్రం అన్‌లాక్ కాదు. మన కళ్ళలోనే ఉంది కిటుకంతా మరి!
* 2006 వరకూ భారత సైన్యం, వైమానిక దళాలు సెల్యూట్ చేసే విధానం ఒకే విధంగా ఉండేది. ఆ తర్వాత, వైమానిక దళం చేతిని
45 డిగ్రీల వంపు తిరిగి ఉండేలా తమ సెల్యూట్‌ని మార్చుకున్నారు... అచ్చం ఎగిరే విమానంలా!
మన దేశంలో పరీక్ష హాలుకి వెళ్ళగానే.. క్వశ్చన్ పేపరూ, ఆన్సర్ షీట్సూ తప్ప ఏమీ ఇవ్వరు కదా! అదే సౌదీ అరేబియాలోనైతే ఆ రెండింటితోపాటూ ఐస్‌క్రీమ్, చాకొలెట్, శాండ్‌విచ్, వాటర్‌బాటిల్, టీ ఇవన్నీ సరఫరా చేస్తారట విద్యార్థులకి!
యురేనస్‌కి 27 చందమామలు ఉంటాయి. చిత్రమేంటంటే... వాటిల్లో రెండు తప్ప అన్నింటికీ షేక్స్‌పియర్ నాటకాల నుంచే పేర్లని పెట్టారు. జూలియట్, మిరాండా, ఏరియల్, పక్... ఇలా సాగుతుంది వరస!
ఆసుపత్రుల్లో ఎక్కించే ‘డ్రిప్స్’ని మనందరం సెలైన్ (ఉప్పునీళ్ళు) అంటుంటాం కానీ... అందులో ఉప్పు కేవలం 0.9 శాతమే ఉంటుంది. లీటర్ నీటికి 9 గ్రాములన్నది లెక్కట!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
India News
Mamata Banerjee: ‘మృతుల సంఖ్యలో వాస్తవమెంత? ’
-
Crime News
Hyderabad: ఇద్దరు చిన్నారులు కిడ్నాప్.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్టు
-
Crime News
Heart attack: శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతుల మృతి
-
Sports News
WTC Final: అతడికి బౌలింగ్ చేసినా.. సచిన్‌కు చేసినా ఒకేలా భావిస్తా: వసీమ్ అక్రమ్
-
Politics News
CM KCR: ధరణి వద్దన్న వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్
-
India News
Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన.. సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు