పక్క పక్క దీవులు... వేర్వేరు రోజులు..!

పక్క పక్కనే ఉన్న రెండు గ్రామాలు కావచ్చు, అతి దగ్గరగా ఉన్న రెండు పెద్ద నగరాలు కావచ్చు.... అక్కడి గడియారాలు సహజంగా ఒకే సమయం చూపుతాయి.

Published : 14 Jan 2023 23:36 IST

పక్క పక్క దీవులు... వేర్వేరు రోజులు..!

పక్క పక్కనే ఉన్న రెండు గ్రామాలు కావచ్చు, అతి దగ్గరగా ఉన్న రెండు పెద్ద నగరాలు కావచ్చు.... అక్కడి గడియారాలు సహజంగా ఒకే సమయం చూపుతాయి. కొన్ని చోట్ల అటుఇటుగా కొంత తేడా ఉండొచ్చు. కానీ, అమెరికా, రష్యా దేశాల సరిహద్దుల్లో ఉన్న రెండు దీవుల్లో మాత్రం సమయానికి సంబంధించిన ఓ విచిత్రం మనకు తారసపడుతుంది. అలస్కా, రష్యాల మధ్య సముద్రంలో బిగ్‌ డయామీడ్‌, లిటిల్‌ డయామీడ్‌ అని రెండు దీవులున్నాయి. వాటి నడుమ దూరం గట్టిగా నాలుగు కిలోమీటర్లు కూడా ఉండదు. కానీ, సమయంలో తేడా మాత్రం ఇరవై గంటలకు పైగా ఉంటుంది. ఆ రెండింటి మధ్యలోంచి అంతర్జాతీయ డేట్‌ లైన్‌ వెళ్లటమే అందుకు కారణం. ప్రపంచదేశాల సమయాలను నిర్ధారించే ‘గ్రీన్‌విచ్‌ మీన్‌ టైమ్‌’(జీఎమ్‌టీ) ఆధారంగానే అక్కడ సమయాన్ని నిర్ణయిస్తారు. అందుకే ‘యెస్టర్‌ డే ఐలాండ్‌’గా పిలుచుకునే లిటిల్‌ డయామీడ్‌లో సమయం ఆదివారం ఉదయం పదిగంటలు అయిందనుకోండి- ‘టుమారో ఐలాండ్‌’గా పిలుచుకునే బిగ్‌ డయామీడ్‌లో తేదీ, వారం మారిపోయి సోమవారం ఉదయం ఏడు గంటల సమయాన్ని చూపుతాయి గడియారాలు. నూట యాభై ఏళ్ల క్రితం అలస్కాను రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేశాక ఆ దీవుల్లో ఈ పరిస్థితి తలెత్తింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..