కుర్రాళ్లోయ్‌ కోకకట్టారోయ్‌!

స్నేహితుల పెళ్లికి విలువైన వస్తువులో లేదంటే వాళ్ల అభిరుచికి తగినవో... ఏవో కానుకలు ఇస్తుంటాం. అయితే మిషిగన్‌కు చెందిన ఓ ప్రవాస భారతీయుడికి మాత్రం తన ఇద్దరు స్నేహితులూ ఓ అపురూపమైన కానుక ఇచ్చారు

Published : 27 Nov 2022 00:02 IST

కుర్రాళ్లోయ్‌ కోకకట్టారోయ్‌!

స్నేహితుల పెళ్లికి విలువైన వస్తువులో లేదంటే వాళ్ల అభిరుచికి తగినవో... ఏవో కానుకలు ఇస్తుంటాం. అయితే మిషిగన్‌కు చెందిన ఓ ప్రవాస భారతీయుడికి మాత్రం తన ఇద్దరు స్నేహితులూ ఓ అపురూపమైన కానుక ఇచ్చారు. అలాగని ఖరీదైన నగలో, గ్యాడ్జెట్లో కాదు. వాళ్లిద్దరూ చక్కగా పట్టుచీరా, నుదుట సిందూరం, కళ్లకి కాటుక ధరించి స్నేహితుడి పెళ్లికి వెళ్లారు. వారిలో ఒకరు భారతీయుడైతే, మరొకరు అమెరికన్‌. తమని చీరలో చూసిన తమ స్నేహితుడి హావభావాల్ని చూడాలనీ వాటిని కెమెరాల్లో బంధించి బహుమానంగా ఇవ్వాలనీ అనుకున్నారు ఈ కుర్రాళ్లు. అనుకున్నట్టుగానే వాళ్ల మిత్రుణ్ని సర్‌ప్రైజ్‌ చేయడంతోపాటు పెళ్లికి వచ్చిన వాళ్లనీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వాళ్లు చీరకట్టుకుని రెడీ అయిన దగ్గర్నుంచీ... స్నేహితుణ్ని కలవడం, పెళ్లిలో సందడి చేయడం వంటివన్నీ ప్రత్యేకంగా వీడియో తీయించుకుని దాన్ని ఆ తరవాత బహుమతిగా అందించారు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్‌ మీడియాలో హచ్‌చల్‌ చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..