హిందీ నేర్చుకుంటున్నారు

వయోజన  విద్యలో భాగంగా పెద్దవాళ్లూ, వృద్ధులూ రాత్రిపూట చదువుకోవడం మనకు తెలిసిందే. అయితే కేరళలోని కోళికోడ్‌ జిల్లా చలన్నూర్‌ గ్రామంలో వంద శాతం అక్షరాస్యత ఉన్నప్పటికీ- పిల్లల నుంచి పెద్దల వరకూ రాత్రిపూట బడికి వెళుతుంటారు.

Published : 27 Nov 2022 00:08 IST

హిందీ నేర్చుకుంటున్నారు

వయోజన  విద్యలో భాగంగా పెద్దవాళ్లూ, వృద్ధులూ రాత్రిపూట చదువుకోవడం మనకు తెలిసిందే. అయితే కేరళలోని కోళికోడ్‌ జిల్లా చలన్నూర్‌ గ్రామంలో వంద శాతం అక్షరాస్యత ఉన్నప్పటికీ- పిల్లల నుంచి పెద్దల వరకూ రాత్రిపూట బడికి వెళుతుంటారు. వారాంతాల్లో జరిగే క్లాస్‌లకీ హాజరవుతుంటారు. మరి చదువుకున్నా వాళ్లేం నేర్చుకుంటున్నారనే కదా సందేహం. వాళ్లు నేర్చుకునేది హిందీ. అంతేకాదు, గ్రామంలో ప్రతి ఒక్కరికీ ఆ భాష వచ్చి తీరాలనే నియమమూ పెట్టుకున్నారు. అందుకు కారణం ఆ గ్రామంలో వలస కార్మికులు ఎక్కువ. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళుతుంటారు. వాళ్లకి హిందీ వచ్చి ఉంటే బతుకు తెెరువు సులువు అవుతుందని ఆ నిర్ణయానికొచ్చారు. దాంతోపాటు ఇతరులకు హిందీ నేర్పించడం ద్వారా కొందరికి ఉపాధి దొరుకుతుందని కూడా ఆలోచించారు. అందుకే హిందీ నేర్చుకుంటున్నారు. త్వరలో ఆ గ్రామం కేరళలోనే వంద శాతం హిందీ వచ్చిన గ్రామంగానూ రికార్డుకెక్కనుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..