AC Railway Station: తొలి ఏసీ రైల్వేస్టేషన్‌.. భలే సౌకర్యాలు! 

బెంగళూరులోని విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్‌ దేశంలోనే తొలి ఏసీ రైల్వే స్టేషన్‌. నైరుతి రైల్వే జోన్‌పరిధిలో బాణసవాడి- బయ్యప్పనహళ్లి స్టేషన్‌ల మధ్య దీన్ని నిర్మించారు.

Updated : 27 Nov 2022 14:55 IST

AC Railway Station: తొలి ఏసీ రైల్వేస్టేషన్‌.. భలే సౌకర్యాలు! 

బెంగళూరులోని విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్‌ దేశంలోనే తొలి ఏసీ రైల్వే స్టేషన్‌. నైరుతి రైల్వే జోన్‌పరిధిలో బాణసవాడి- బయ్యప్పనహళ్లి స్టేషన్‌ల మధ్య దీన్ని నిర్మించారు. మొదట బయ్యప్పనహళ్లి ·రైల్వే టర్మినల్‌ పేరుతో ఉన్న ఈ స్టేషన్‌ను ఏసీ రైల్వేస్టేషన్‌గా మార్చి... ప్రసిద్ధ ఇంజనీరు ‘సర్‌ ఎం.మోక్షగుండం విశ్వేశ్వరయ్య’ పేరును పెట్టారు.  ఇక్కడ కంప్యూటర్‌ టికెట్‌ కేంద్రాలూ, టచ్‌స్క్రీన్‌ కియోస్క్‌లూ, దివ్యాంగులకు ర్యాంపులూ, మార్గాలూ, మహిళలకు విశ్రాంతి గదీ, అప్పర్‌ క్లాస్‌  ప్రయాణీకులకు విలాసవంతమైన వెయిటింగ్‌హాళ్లనూ ఏర్పాటు చేశారు. గ్రంథాలయాలూ, ఏటీఎంలూ, ఫుడ్‌కోర్టులూ సరేసరి. అలానే, స్టేషన్‌లో ఎస్కలేటర్లతోపాటు ఎక్కువ సంఖ్యలో లిఫ్ట్‌లూ ఉంటాయి. వర్షపు నీటి సేకరణ, వాటర్‌ రీసైక్లింగ్‌, వాటర్‌ హార్వెస్టింగ్‌ వ్యవస్థ... విశ్వేశ్వరయ్య స్టేషన్‌కు మరో ప్రత్యేకత. ఈ మొత్తం నిర్వహణకు విద్యుత్‌ అవసరాలకోసం పూర్తిగా సౌరవిద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..