ఈ పుస్తకంలోని బొమ్మల్ని... కదిలించొచ్చు!
పుస్తకంలోని బొమ్మలు నచ్చినట్టు కదిల్చేలా ఉంటే... కథలోని పాత్రలు కావాలనుకున్నట్టు మార్చుకునేలా ఉంటే... అంకెలూ, ఆకారాలూ తీసిపెట్టేలా ఉంటే... అరె, ఎంత బాగుంటుందో కదూ... ఇదిగో ఆ ముచ్చట తీర్చడానికే వచ్చేశాయి ‘క్వైట్ బుక్స్’!
ఈ పుస్తకంలోని బొమ్మల్ని... కదిలించొచ్చు!
పుస్తకంలోని బొమ్మలు నచ్చినట్టు కదిల్చేలా ఉంటే... కథలోని పాత్రలు కావాలనుకున్నట్టు మార్చుకునేలా ఉంటే... అంకెలూ, ఆకారాలూ తీసిపెట్టేలా ఉంటే... అరె, ఎంత బాగుంటుందో కదూ... ఇదిగో ఆ ముచ్చట తీర్చడానికే వచ్చేశాయి ‘క్వైట్ బుక్స్’!
బుజ్జిమాటలు చెప్పే బుజ్జాయిల్ని సరదాగా ఆడిస్తూనే ‘అ... అమ్మ, ఆ... ఆవు’ అంటూ అక్షరాలూ... ‘అనగనగా ఓ అడవి ఉంది...’ అంటూ చిట్టిపొట్టి కథలూ చెబుతుంటాం. వయసును బట్టి చిన్నారుల తెలివితేటల్ని పెంచే ప్రయత్నం చేస్తుంటాం. అందుకు తగ్గట్టుగానే చూడచక్కని బొమ్మలతో వారికి సులువుగా అర్థమయ్యేలా చెప్పే బొమ్మల పుస్తకాల్ని ఎంచుకుంటాం. వాటిల్లో అక్షరాలూ, పద్యాలూ, బొమ్మల పేర్లలాంటివి నేర్పించేవీ... కథలతో ఉన్నవీ ఎన్నెన్నో ఉంటాయి. అయితే ఆ పుస్తకాల ముందు పిల్లలు ఎంతసేపని కూర్చుంటారు చెప్పండి, బోర్ కొట్టేయదూ! అలా కాకుండా ఎంచక్కా పిల్లలు చదువుతూనే ఆడుకునేలా ఉండాలనుకుంటే మాత్రం ఈ ‘క్వైట్ బుక్స్’ని కొనివ్వొచ్చు.
ఇవీ మామూలు పుస్తకాల్లానే రకరకాల అంశాలతో ఉన్నా... వీటికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి పుస్తకమంతా వస్త్రంతో కుట్టడం. రెండోది పుటల్లోని బొమ్మలన్నీ తీసి మళ్లీ పెట్టేలా, ఒకదగ్గరి నుంచి మరో దగ్గరికి మార్చుకునేలా ఉండటం. ‘కాగితానికి బదులుగా క్లాత్ బుక్స్ తయారుచేయడం తెలిసిందే గానీ ఇలా బొమ్మల్ని తీసి పెట్టడం అనేది ఎలా కుదురుతుందబ్బా’ అంటారేమో... ఇప్పటి వరకూ మనం చూసిన వాటిల్లో అయితే పుస్తకంలో విషయానికి సరిపోయే బొమ్మలు ప్రింట్‌చేసి ఉంటాయి కదా. కానీ ఈ క్వైట్ పుస్తకాల్లో మాత్రం ఆ బొమ్మలన్నీ చిన్న చిన్న ముక్కల్లా ఉండి వెల్‌క్రో, బటన్స్‌లాంటి వాటితో పేజీల్లో అతికించి ఉంటాయి. అందుకే ఆ బొమ్మలన్నింటినీ మనకు నచ్చినట్టు తీసుకోవచ్చూ, పెట్టుకోవచ్చన్నమాట.
కొత్త కథనూ చూపొచ్చు...
ఈ పుస్తకాలు చిన్నపిల్లల నుంచి కాస్త పెద్దపిల్లల వరకూ అందరికీ సరిపోయేలా రకరకాల అంశాలతో దొరుకుతున్నాయి. వీటిల్లో పిల్లలకు కావాల్సిన అక్షరాలూ, లెక్కలూ, ఆకారాలూ, జంతువులూ, కూరగాయలూ, వాహనాలూ ఇలా చాలా రకాల అంశాలు ఆయా బొమ్మలతో ఉంటాయి. ఇంకా అంతరిక్షమూ, రుతువులూ లాంటి విషయాలూ పజిల్సూ, కథలూ ఉంటాయి. ఒక్కో పేజీలో ఒక్కో అంశంతో ఉన్న ఈ బొమ్మలన్నింటినీ నచ్చినట్టు అమర్చుకోవచ్చు. ఎన్నెన్నో లెక్కలూ చేయొచ్చు. కావాలంటే ఊహాశక్తికి పదునుపెడుతూ ఆ బొమ్మలతోనే కొత్త కథల్నీ సృష్టించొచ్చు కూడా. ఆటలా ఉంటూనే అన్నీ నేర్పించేలా ఉన్న ఈ యాక్టివిటీ బుక్స్... కచ్చితంగా ఏ చిన్నారులకైనా నచ్చేస్తాయి. ఈసారి పిల్లలకిచ్చే కానుకల జాబితాలో దీన్నీ చేర్చొచ్చు... ఏమంటారు!?
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Laddu Auction: బండ్లగూడ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం