30 ఏళ్లు ఆగాల్సిందే!
స్విగ్గీలోనో, జొమాటోలోనో ఏదైనా ఆర్డర్ ఇస్తే... మనం ఎంత సేపు ఎదురుచూస్తాం? అరగంట... మహా అయితే గంట. కానీ, ఏదైనా ఆర్డర్ ఇస్తే- ‘30 ఏళ్లలోగా మీరు అడిగింది డెలివరీ చేస్తాం’ అంటే ఎలా ఉంటుంది? జపాన్‌లోని టకాసాగో నగరంలో అసహియా ఫ్యామిలీ షాప్‌లో అమ్మే క్రుకెట్స్ కావాలంటే మాత్రం అన్నేళ్లు ఎదురుచూడాల్సిందే. బంగాళాదుంపలూ ఒకరకం పశుమాంసం కలిపి తయారుచేసే వాటికి రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచే లోకల్‌గా మంచి డిమాండ్ ఉంది. ఇరవై ఏళ్ల క్రితం వాటి రుచి గురించి బయట ప్రపంచానికి తెలియడంతో ఆర్డర్లు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పటి నుంచి ఆ వంటకాన్ని రుచి చూడాలనుకునే వారికి సంవత్సరాల తరబడి వెయిటింగ్ తప్పడం లేదు. ‘2013లో ఆర్డర్ చేస్తే క్రుకెట్స్ ఇప్పుడు మా ఇంటికి చేరాయి’ అంటూ మొన్నీమధ్య ఓ జపాన్ మహిళ ట్వీట్ చేయడంతో అవి నెట్లో సెన్సేషన్ అయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
India News
ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ప్రభావాలు: ప్రముఖ హృద్రోగ నిపుణుడి వ్యాఖ్యలు
-
India News
NEET PG 2023: ఎంబీబీఎస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పెంపు
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి