ఇళ్లు కావు, ఇవి సమాధులు..!
మెక్సికోలోని ‘జార్డైన్స్ డెల్ హుమయా’ ప్రాంతానికి వెళ్తే ఎటు చూసినా విలాసవంతంగా నిర్మించిన భవనాలే కనిపిస్తాయి. వాటి లోపల 24గంటలూ పనిచేసే ఏసీలూ, సీసీ కెమేరాలూ, ఆధునిక సౌకర్యాలతో వంట గదులూ, పడకగదులూ, హోమ్ థియేటర్, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలూ, చీకటి పడగానే వాటంతటవే వెలిగే లైట్లూ, సెక్యూరిటీ అలారం... ఇలా ఎన్నో హంగులు. కానీ ఇవి మనుషులు నివసించే ఇళ్లు కాదు. జార్డైన్స్ శ్మశానవాటికలోని సమాధులు. నమ్మలేకపోయినా ఇది ముమ్మాటికీ నిజం. స్థానిక సినలొవా రాష్ట్రం డ్రగ్ మాఫియాకు పెట్టింది పేరు. మత్తుమందుల్ని రవాణా చేస్తూ కరడుగట్టిన నేరాలకు పాల్పడుతూ అక్కడి డాన్లు పోగేసిన సొమ్ము ఎంతో లెక్కేలేదు. కానీ శత్రువుల దాడితో ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో తెలియని పరిస్థితి. ఎంతోమంది డాన్లూ వారి సన్నిహితులూ అర్ధాంతరంగా చనిపోయారు కూడా. అలాంటి పేరుమోసిన డాన్ల కోసం వారి స్థాయినీ విలాసాన్నీ తెలియజేసేలా కుటుంబ సభ్యులు ఇలా అత్యాధునిక సౌకర్యాలతో సమాధి భవనాలను నిర్మిస్తుంటారు. చనిపోయిన వారి ఆత్మలు సమాధుల దగ్గరే ఉంటాయనే నమ్మకమూ దీనికో కారణం. అందుకే, సన్నిహితులు తరచూ ఈ భవనాలకు వెళ్లి పూజా కార్యక్రమాలూ పార్టీలూ ముఖ్యమైన మీటింగుల్నీ నిర్వహిస్తుంటారు. ఇక, ఈ విలాసవంతమైన సమాధులకోసం కోట్లు ఖర్చు చేస్తారని ప్రత్యేకంగా చెప్పేదేముందీ..?
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్