Published : 03 Jul 2022 01:02 IST

ఎడారి ఊరు ఎంత బాగుందో!

వైపు బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించే సూర్యుడూ... మరోవైపు ఆ పసిడి కాంతులతో పోటీపడే ఇసుక తిన్నెలూ... మధ్యలో- అటూ ఇటూ పరుచుకున్న ఆ అందాల్ని చూపించే చూడచక్కని ఇళ్లు. వింటేనే వెళ్లాలనిపించేలా ఉన్న ఈ సంగతులన్నీ రాజస్థాన్‌లోని ‘ఖిమ్‌సర్‌ శాండ్‌ డ్యూన్‌ విలేజ్‌’ అనే ఓ రిసార్ట్‌వి. థార్‌ ఎడారిలో పర్యటకుల్ని ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రాంతానికి చేరాలంటే ఒంటెలూ, జీపులూ ఎక్కి వెళ్లాల్సిందే. ఎడారిలో సఫారీ చేసి హాయిగా ఓ పూట బస చేయాలనుకున్నవాళ్లు ఈ రిసార్ట్‌లో ఉండొచ్చు. ఇసుకతిన్నెల నడుమ ఒయాసిస్‌లాంటి కొలనూ, దాని చుట్టూ ముచ్చటైన కుటీరాలూ, అక్కడక్కడా పచ్చని చెట్లూ... ఎంతో అందంగా ఉంటుందిది. పల్లెవాతావరణంలా ఉండే ఈ రిసార్ట్‌లోని బుల్లి ఇళ్లల్లో సకల సౌకర్యాలూ ఉంటాయి. ఎంచక్కా ఇక్కడి సంప్రదాయ వంటల్నీ చెప్పి చేయించుకోవచ్చు. పైగా రాత్రివేళ సందర్శకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలూ జరుగుతుంటాయి. ఇంతగా ఆకట్టుకునేలా ఉన్న ఈ ప్రాంతానికి పర్యటకులు రాకుండా ఉంటారా మరి!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని