ఒకే ఇల్లు... రెండు దేశాల్లో!

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసాలు, పాస్‌పోర్టులు, విమానం టిక్కెట్లు... కావాలి. కానీ, నాగాలాండ్‌లోని లోంగ్వా అనే గ్రామానికి వెళితే అవేవీ లేకుండానే దేశం సరిహద్దులు దాటడం చాలా తేలిక.

Published : 22 Jan 2023 00:06 IST

ఒకే ఇల్లు... రెండు దేశాల్లో!

క దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసాలు, పాస్‌పోర్టులు, విమానం టిక్కెట్లు... కావాలి. కానీ, నాగాలాండ్‌లోని లోంగ్వా అనే గ్రామానికి వెళితే అవేవీ లేకుండానే దేశం సరిహద్దులు దాటడం చాలా తేలిక. ఈ గ్రామ పెద్ద ఇంట్లో బెడ్‌రూమ్‌ నుంచి వంటగదిలోకి వెళ్తే చాలు... దేశం సరిహద్దులు దాటినట్లే. కారణం ఇండియా- మయన్మార్‌ అంతర్జాతీయ సరిహద్దు లోంగ్వాలోని ఆ ఇంటి మధ్యలోంచి వెళ్తుంది. ఇంట్లో సగం అంటే పడక గదులు ఇండియాలోకి, కిచెన్‌ మయన్మార్‌ పరిధిలోకీ¨ వస్తాయి. అంటే ఆ ఇంట్లో వాళ్లు నిద్రలేచి టీ పెట్టుకోవడానికి వంటగదిలోకి వస్తే... దేశం దాటిపోయినట్లే! అంతేకాదు, భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. కానీ, ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా లోంగ్వా గ్రామస్థులకు ద్వంద్వ(ఇండియా- మయన్మార్‌) పౌరసత్వం ఉంటుంది. కోన్యాక్‌ నాగా తెగవాసులు నివసిస్తోన్న లోంగ్వా ఇప్పుడు పర్యటక ప్రాంతమైంది. వాళ్ల ఆచార వ్యవహారాలనూ, సరిహద్దు సంస్కృతినీ చూడటానికి పర్యటకులు బారులు తీరుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..