రైతన్నకి దక్కిన గౌరవం!
ప్రచారం కోసం కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపైన సినీ తారల బొమ్మల్ని ఉంచడం చూసుంటారు. కొన్ని ఉత్పత్తులపైన వాటి యజమానుల బొమ్మలుండటమూ జ్ఞాపకమేగా! కానీ పారాచూట్ కొబ్బరి నూనె తయారీ సంస్థ మారికో మాత్రం రైతుల బొమ్మల్ని తమ బాటిళ్లపైన ముద్రించింది.
రైతన్నకి దక్కిన గౌరవం!
ప్రచారం కోసం కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపైన సినీ తారల బొమ్మల్ని ఉంచడం చూసుంటారు. కొన్ని ఉత్పత్తులపైన వాటి యజమానుల బొమ్మలుండటమూ జ్ఞాపకమేగా! కానీ పారాచూట్ కొబ్బరి నూనె తయారీ సంస్థ మారికో మాత్రం రైతుల బొమ్మల్ని తమ బాటిళ్లపైన ముద్రించింది. దేశ ప్రగతిలో- ఆరుగాలం శ్రమించే రైతుది ప్రథమ స్థానమనీ, వారి శ్రమని అందరూ గుర్తించాలనీ ఈ ప్రయత్నం చేసిందా సంస్థ. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ... లాభాల బాటలో నడుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న- అశోకన్ అర్వింద్, మోతీ సింగ్, సందీప్ గీతే, వినోద్ కుమార్‌ల బొమ్మల్ని ఈ సంస్థ తాజాగా మార్కెట్‌లోకి తెచ్చిన కొబ్బరి నూనె బాటిళ్లపైన ముద్రించింది. ఆ రైతుల జీవితాలు మిగతా రంగాల్లో ఉన్నవారికి స్ఫూర్తి నివ్వాలనే ఉద్దేశంతో ప్యాక్ లోపల వారి విజయగాథల్ని ఓ కాగితంపైన ముద్రించి ఉంచింది కూడా. అంతేకాదు, ప్యాక్‌లో ఒక సీడ్ పేపర్‌నీ పెట్టింది మారికో సంస్థ. వాటిని నాటితే మొక్కలు వస్తాయి. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా రైతే రాజు కదా!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Parineeti-Raghav : ఒక్కటైన ‘రాగ్నీతి’.. లీలా ప్యాలెస్‌లో వైభవంగా వివాహం
-
Economy: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో భాజపా ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్
-
Tagore Movie: పాటలు వద్దన్న మురగదాస్.. అలా ఛాన్స్ దక్కించుకున్న వినాయక్
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..