దారులు కావు దీవులే!

ఒకానొక పెద్ద సరస్సు... అందులో సన్నటి దారులు... ఆ దారుల్ని చేరడానికి ఎక్కడెక్కడి నుంచో పడవలేసుకుని వస్తుంటారు సందర్శకులు. ఎందుకంటే... అవి దారులంటే దారులు కావు, సన్నని దీవులు.

Published : 26 Nov 2022 23:56 IST

దారులు కావు దీవులే!

ఒకానొక పెద్ద సరస్సు... అందులో సన్నటి దారులు... ఆ దారుల్ని చేరడానికి ఎక్కడెక్కడి నుంచో పడవలేసుకుని వస్తుంటారు సందర్శకులు. ఎందుకంటే... అవి దారులంటే దారులు కావు, సన్నని దీవులు. ‘నీటి మధ్యలో ఉండే గుండ్రటి చిన్న భూభాగాల దీవుల్ని చూశాం కానీ ఇలా చిత్రంగా సన్నని నేలలే దీవుల్లా ఉండటం ఎక్కడా చూడలేదే’ అనేస్తారు చూసినవారు ఎవరైనా సరే. అందుకే మరి నెదర్లాండ్స్‌లోని ఈ వింకేవీన్‌ సరస్సు అంత ఫేమస్‌ అయింది. ఉన్నది కాస్త నేలే అయినా నీటిమధ్యలో పొడుగ్గా ఒక్కో వరస వీధిలా చాలామంది ఇక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటారు. అంతేకాదు, ఇక్కడే పర్యటకుల కోసం హోటళ్లూ, అద్దె ఇళ్లూ, చిన్న తోటలూ ఉంటాయి. ఒకప్పుడు సరస్సులోని ఎరువు మట్టిని ఎండబెట్టడానికి వాడే ఈ దీవుల్నే పోనూపోనూ ఇసుకతో ఇంకాస్త బలంగా తయారుచేసుకుంటూ ఇలా నివాసాల్లా మార్చుకున్నారట. అటూ ఇటూ నీళ్లూ, మధ్యలో ఇళ్లూ... చూస్తుంటే గమ్మత్తుగా ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..