జీన్స్ చెప్పుల్లో... ఎన్ని డిజైన్‌లో!
జీన్స్‌ప్యాంటు- టాప్ రెండూ అదిరిపోయాయి కానీ... చెప్పులే కొద్దిగా మ్యాచ్ కావడంలేదని అనిపిస్తోందా... దానికి పరిష్కారం చూపిస్తూ... అచ్చంగా జీన్స్ వస్త్రంతోనే తయారుచేసిన చెప్పుల్ని
జీన్స్ చెప్పుల్లో... ఎన్ని డిజైన్‌లో!
జీన్స్‌ప్యాంటు- టాప్ రెండూ అదిరిపోయాయి కానీ... చెప్పులే కొద్దిగా మ్యాచ్ కావడంలేదని అనిపిస్తోందా... దానికి పరిష్కారం చూపిస్తూ... అచ్చంగా జీన్స్ వస్త్రంతోనే తయారుచేసిన చెప్పుల్ని తీసుకొచ్చేశారు డిజైనర్లు. అటు మ్యాచింగ్‌గా ఉండటమే కాకుండా ఇటు ట్రెండీలుక్ని కూడా అందించే ఈ చెప్పుల్లో షూస్ నుంచి హీల్స్ వరకూ ఎన్నో రకాలు ఉన్నాయి మరి.
ఒకప్పుడు దుస్తులకు ఉన్న ప్రాధాన్యం చెప్పులకు ఉండేది కాదు. అందుకే చీర, చుడీదార్, జీన్స్‌ప్యాంటు, స్కర్టు...ఇలా దేనిమీదకైనా ఒకే రకం చెప్పులు వేసుకుని వెళ్లిపోయేవారు. రోజులు మారేకొద్దీ వాటిల్లోనూ ఫ్లిప్‌ఫ్లాప్స్, శాండల్స్, హై హీల్స్, లోఫర్స్, జూతీస్... అంటూ బోలెడు డిజైన్లు వచ్చేయడంతో దుస్తులకు తగినట్లుగానే కాదు, సందర్భానికి సరిపోయేలా వాటిని వేసుకునేందుకు ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు ఫ్యాషన్ ప్రేమికులు. ఇప్పుడు ఆ చెప్పుల రకాలన్నీ జీన్స్ వస్త్రంలోనూ తయారుచేసిన డిజైనర్లు... ‘జీన్స్ దుస్తులకు జతగా అవీ ఇవీ ఎందుకూ... హాయిగా వీటినే వేసుకో’మని సూచిస్తున్నారు.
నిజానికి నిన్నమొన్నటి వరకూ జీన్స్ అంటే కేవలం షర్టులూ ప్యాంట్లే ఉండేవి. క్రమంగా ఆ వస్త్రంతోనూ కుర్తా, స్కర్టు... వంటివి వచ్చాయి. ఇక, జీన్స్ప్యాంట్లలో అయితే... బాయ్‌ఫ్రెండ్, బూట్‌కట్, జెగ్గింగ్స్, రిప్ప్డ్, ఫ్లేర్డ్, టోర్న్... అంటూ ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. వాటన్నింటి మీదకు ఏవో ఒక చెప్పులు వేసుకుంటే లుక్ ఉండదు గనుకే డిజైనర్లు ఇలా ప్రయోగాలు చేసి సాధారణ ఫ్లిప్‌ఫ్లాప్స్ నుంచి పంప్స్, వెడ్జెస్, హీల్స్, శాండల్స్, లోఫర్స్, స్పోర్ట్స్షూస్ వరకూ దాదాపు అన్నిరకాల చెప్పుల్నీ రకరకాల షేడ్స్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఈ చెప్పుల్ని ఏదో పేరుకు డిజైన్ చేసినట్లు కాకుండా వాటిపైన ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా చేస్తూ... సీక్వెన్లూ, రకరకాల రంగురాళ్లు అతికిస్తూ... ఎంత బాగున్నాయో అనిపించేలా రూపొందిస్తున్నారు. అదే పిల్లలకు అయితే బూట్లూ, శాండల్స్ వంటివే ఎక్కువగా ఉంటాయి కాబట్టి... వాటిపైన జంతువుల బొమ్మలూ, జిప్పులూ... లాంటివి జతచేస్తున్నారు. అదండీ సంగతి... ఈ చెప్పుల్లో కనీసం రెండుమూడు రకాలను కొనిపెట్టుకుంటే జీన్స్ దుస్తులు వేసుకున్నప్పుడల్లా సౌకర్యాన్ని బట్టి హీల్సో, షూసో ఎంచుకోవచ్చు. మ్యాచింగ్ అదిరిపోయిందంటూ చుట్టూ ఉన్నవారి నుంచి ప్రశంసలూ అందుకోవచ్చు. ఏమంటారూ..!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: ప్రణీత్‌రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Salman Khan: సల్మాన్ ఖాన్- అట్లీ కాంబో.. అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే?