Published : 15 May 2022 01:19 IST

అందంగా వడకడదాం...

టీ స్ట్రెయినర్‌, టీ ఇన్‌ఫ్యూజర్‌... రకం ఏదైనా ఉపయోగం మాత్రం ఒక్కటే. మనసుని తేలికపరిచే తేనీటికి రుచిని తెచ్చే వీటిని సాదా సీదాగా వాడేస్తే ఏం బాగుంటుంది! కానీ నిజానికి ఒకప్పుడు టీని పల్చని నూలు వస్త్రంలో వడకట్టేవారు. తర్వాత ప్లాస్లిక్‌తో చేసిన వడకట్టులూ వచ్చాయి. ఆపై కాగితం సాచెట్లలో టీపొడిని ముంచి తీసే తీరు మొదలయ్యింది. ఇవన్నీ సౌకర్యం కోసం వచ్చినవే. అయితే ఇప్పుడు దాంతో పాటూ వాటి లుక్కూ ముఖ్యమే అంటున్నారు. అలాంటివారికోసం ఇత్తడితో చేసిన స్ట్రెయినర్లూ, ఇన్‌ఫ్యూజర్లూ అందుబాటులోకి వచ్చాయి. నక్షత్రం మొదలుకుని బుట్టల వరకూ ఎన్నో ఆకృతుల్లో ఇవి దొరుకుతున్నాయి. బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. అలాంటి డిజైన్లే ఇవన్నీ. మీరూ ఓ లుక్కేయండి మరి!


వెండి రంగు కుండీలు వారెవ్వా!

గృహాలంకరణకు ఎన్ని వస్తువులున్నా మొక్కల తర్వాతే ఏవైనా! అందుకే వాటిని పెట్టే కుండీలు అంతే ప్రత్యేకంగా ఉండాలనుకుంటాం. నిన్న మొన్నటి వరకూ సిరామిక్‌, ప్లాస్టిక్‌లో ఎన్నెన్నో రకాల కుండీలూ వచ్చాయి. ఇప్పుడు అల్యూమినియంతో చేసిన సిల్వర్‌ మెటాలిక్‌ ఫినిషింగ్‌ కుండీలదే ట్రెండ్‌.  పచ్చటి మొక్కలు వెండి మెరుపులతో ఇంటీరియర్‌ డిజైన్లకు కొత్త లుక్‌ని తెచ్చిపెడుతున్నాయి. వివిధ రకాల ఆకృతుల్లో ముచ్చటగొలుపుతున్న ఇవి ఎవరికైనా నచ్చేస్తాయి మరి.


చూడ ముచ్చటగా... ధూపమేద్దాం!

పూర్వం దేవుడికి ధూపం వేయాలన్నా, జుట్టుని ఆరబెట్టుకోవాలన్నా...ఓ ప్లేటులోనో, మట్టి మూకుడులోనో నిప్పులు వేసి పైన సాంబ్రాణి వేసేవారు. సహజ సువాసనలు ఇల్లంతా వ్యాపించడానికి కూడా ఇలా నిప్పులపైన ఎసెన్షియల్‌ నూనెల్ని చల్లేవారు. అయితే అపార్ట్‌మెంట్ల సంస్కృతి వచ్చాక... అవి కాస్తా సాంబ్రాణీ కడ్డీలుగా, స్టిక్కులుగా మారిపోయాయి. పరిమళ ద్రవ్యాలు స్ప్రేల రూపంలోకి వచ్చేశాయి. అయినా ఒకప్పటి అనుభూతిని ఆస్వాదించడానికి ధూపం వేయాల్సిందే అనేవారికోసం ఇప్పుడు నగిషీలు చెక్కిన అందమైన డిజైనర్‌ భరిణెలు దొరుకుతున్నాయి. పట్టుకోవడానికి గ్రిప్‌ కూడా ఉండే వీటిని ఏ మూల పెట్టినా సువాసనా సౌరభాలు సులువుగా వ్యాపిస్తాయి. అందంగానూ అమరి ఆకట్టుకుంటాయి.

ఇంటికి అందాన్నిచ్చేందుకు ప్రత్యేకంగా అలంకరణ సామగ్రిని కొనడం పాత స్టైలు. వాడే వస్తువుల్నే వైవిధ్యంగా ఎంచుకోవడం నయా ట్రెండు. అలాంటివే ఇవన్నీ...


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని