ఒకే దాంట్లో రెండు బొమ్మలు!

కిట్టూ చేతిలో ఒక బొమ్మ ఉంది. అది పులి బొమ్మ. కానీ కాసేపటికి మాయ చేసినట్టుగా ఏనుగు బొమ్మలా మారిపోయిందది. ఎందుకంటే... అది ‘రివర్సిబుల్‌ టాయ్‌’ మరి

Updated : 27 Nov 2022 04:05 IST

ఒకే దాంట్లో రెండు బొమ్మలు!

కిట్టూ చేతిలో ఒక బొమ్మ ఉంది. అది పులి బొమ్మ. కానీ కాసేపటికి మాయ చేసినట్టుగా ఏనుగు బొమ్మలా మారిపోయిందది. ఎందుకంటే... అది ‘రివర్సిబుల్‌ టాయ్‌’ మరి. చిన్నారుల్ని ఆకట్టుకోవాలంటే ఆ బొమ్మలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరాల్సిందేగా. అందుకే కాసేపు వాళ్లకు వినోదాన్ని అందించడానికి ఇలాంటి బొమ్మల్నీ తయారీదారులు తీసుకొస్తుంటారు. ఇక్కడ ఫొటోలో చూపినట్టు రెండు రంగులూ, రెండు రూపాలతో ఉండే ఈ బొమ్మలో మధ్యలో ఉన్న తొడుగును ఒకవైపు పెడితే ఒక బొమ్మా... ఇంకోవైపు పెడితే మరొకటి కనిపిస్తుందన్నమాట. మీ పిల్లలకెప్పుడైనా ఎప్పటిలా టెడ్డీలాంటి వాటికి బదులు ఇలాంటిదాన్ని బహుమతిగా ఇవ్వండి.. ఎంత ఆనందపడి పోతారో మీరే చూస్తారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..