పాకెట్‌ కీ బోర్డ్‌!

ప్రయాణాల్లోనో, ఎక్కడికైనా వెళ్లినప్పుడో కంప్యూటర్‌తో పనిచేయాల్సి వస్తే చాలావరకూ ఫోన్‌, ట్యాబ్‌లతోనే పని చేసేస్తుంటారు. కానీ అలాంటప్పుడు వేగంగా టైప్‌ చేయాలంటే మాత్రం కీ బోర్డ్‌ అనేది తప్పనిసరి

Updated : 27 Nov 2022 00:34 IST

పాకెట్‌ కీ బోర్డ్‌!

ప్రయాణాల్లోనో, ఎక్కడికైనా వెళ్లినప్పుడో కంప్యూటర్‌తో పనిచేయాల్సి వస్తే చాలావరకూ ఫోన్‌, ట్యాబ్‌లతోనే పని చేసేస్తుంటారు. కానీ అలాంటప్పుడు వేగంగా టైప్‌ చేయాలంటే మాత్రం కీ బోర్డ్‌ అనేది తప్పనిసరి. మరి అంత సైజులో ఉండే కీ బోర్డ్‌ను ఎప్పుడూ వెంట పట్టుకెళ్లలేం కదా. ఇదిగో ఆ సమస్యకు పరిష్కారంగా వచ్చిందే ఈ ‘ఫోల్డబుల్‌ బ్లూటూత్‌ కీబోర్డ్‌’. మామూలు కీబోర్డ్‌లానే ఉండే దీన్ని బ్లూటూత్‌తో ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, ఫోన్‌... ఇలా దేనికైనా కనెక్ట్‌ చేసుకుని పనిచేసుకోవచ్చు. పని పూర్తవ్వగానే ఎంచక్కా మడతపెట్టి ఏ బ్యాగు పాకెట్లోనో సర్దేసుకోవచ్చు. పాత వస్తువులో వచ్చిన ఈ కొత్త వెసులుబాటు కచ్చితంగా మీకూ నచ్చే ఉంటుంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..