జెల్‌ సాక్సులివి!

చలికాలం మొదలవ్వగానే దాదాపు చాలామంది తమ పాదాల్ని పదిలంగా ఉంచుకోవడానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

Published : 27 Nov 2022 00:39 IST

జెల్‌ సాక్సులివి!

చలికాలం మొదలవ్వగానే దాదాపు చాలామంది తమ పాదాల్ని పదిలంగా ఉంచుకోవడానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటివారిని దృష్టిలో పెట్టుకునే మార్కెట్లోకి ఎప్పటికప్పుడు బోలెడన్ని కొత్త వస్తువులూ, క్రీములూ వస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఈ ‘జెల్‌ సాక్స్‌’. కాళ్లు పగలకుండా, దుమ్ము పాదాలపైన చేరకుండా ఉండేందుకు మామూలు సాక్సులే చాలా ఉన్నాయి కదా.
మరి వీటి ప్రత్యేకత ఏంటీ అంటారా... ఆలివ్‌, ఇ-విటమిన్‌, ఇతర ఎసెన్షియల్‌ నూనెలతో కలిపి ప్రత్యేకంగా తయారుచేసిన సాక్సులివి. అందుకే వీటిని వేసుకుంటే పాదాలకు కావాల్సిన తేమ అందుతుందట. ఇంకా అందులోని ప్రత్యేకమైన తైలాల వల్ల పాదాలు ఆరోగ్యంగానూ ఉంటాయట. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవో మాయిశ్చరైజర్‌ సాక్సులనుకోవచ్చు. నచ్చిన రంగుల్లో అన్ని సైజుల్లో అందుబాటులో ఉన్నాయివి!

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..