బహుమతి కోసం ఈ పెన్ను!

ఒకప్పటి కన్నా ఈ డిజిటల్‌ యుగంలో పెన్నులతో రాసే పని చాలా వరకూ తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు ఎక్కువగా పెన్ను అనేది బహుమతుల జాబితాల్లోనే చేరిపోయింది.

Published : 04 Feb 2023 23:32 IST

బహుమతి కోసం ఈ పెన్ను!

కప్పటి కన్నా ఈ డిజిటల్‌ యుగంలో పెన్నులతో రాసే పని చాలా వరకూ తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు ఎక్కువగా పెన్ను అనేది బహుమతుల జాబితాల్లోనే చేరిపోయింది. మరి కానుక అంటే... ఎంతో అపురూపంగా దాచుకునేలా ఉండాలి కదా. ఇదిగో ఆ ఉద్దేశంతోనే కొన్ని కంపెనీలు మామూలు వాటికి బదులు వెండీ, బంగారు పూతలతో పెన్నుల్ని సరికొత్తగా తయారుచేస్తున్నాయి. చూడచక్కని దేవుళ్ల రూపాలతో చెక్కిన ఇక్కడున్న పెన్నులు అలా వచ్చినవే. బాలాజీ పద్మావతీ, గణపతీ, శివపార్వతులూ... ఇలా దేవుళ్ల రూపాలతో ముస్తాబై వచ్చిన ఈ వెండిపెన్నులు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..