Updated : 03 Jul 2022 00:46 IST

భలే కిడ్డీ బ్యాంక్‌!

చిన్నారులకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ కానుక వాళ్లకి ఉపయోగపడుతూనే వారికి నచ్చేలా ఉండాలనుకుంటారెవరైనా. అలాంటి వారికోసమే ఎప్పటికప్పుడు మార్కెట్లోకి బోలెడు రకాల పిల్లల వస్తువులు వస్తుంటాయి. ఇప్పుడు అందులో భాగంగానే ఈ ‘సిల్వర్‌ కోటెడ్‌ కిడ్డీ బ్యాంక్స్‌’ వచ్చాయి. కారు, బస్సు, జీపు, రైలు, విమానం వంటి వాహనాల నుంచీ బాతు, ఏనుగు, గుర్రం లాంటి జంతువులూ... టెడ్డీబేర్‌, మిక్కీమౌస్‌ వంటి కార్టూన్‌ పాత్రల వరకూ రకరకాల ఆకారాల్లో పిల్లలు మెచ్చేలా ఉన్నాయి ఇవి. ప్లాస్టిక్‌, ఉడ్‌ కిడ్డీ బ్యాంకులకు బదులు వీటిని ఇచ్చి చూడండి... నచ్చే బొమ్మను చూసి పిల్లలకూ దాంట్లో డబ్బులు దాచాలనే ఆసక్తి కలుగుతుంది.


అక్షరాల కుండీ!

వర్షాకాలం రాగానే మొక్కలంటే ఇష్టమున్న గృహిణులు ఇంటికి కొత్తకుండీలూ, మొక్కలూ తీసుకొస్తుంటారు. ‘ఎప్పుడూ ఒకేలా ఎందుకు? ఈసారి కొంచెమైనా వైవిధ్యం చూపాలి’ అని అనుకుంటే మాత్రం ఈ ‘ఉడెన్‌ ప్లాంటర్‌ లెటర్స్‌’ను ప్రయత్నించి చూడండి. ఇంటి ముందు గోడకు తగిలించుకుని పచ్చని మొక్కలతో అతిథుల్ని ఆహ్వానించొచ్ఛు ఆన్‌లైన్‌ సైట్లలో రకరకాల మొక్కలతో అక్షరాల ఆకారాల్లో దొరుకుతున్నాయి ఇవి. కావాలంటే మనకు నచ్చిన లెటర్‌ ఉన్న ప్లాంటర్‌ని మొక్కలతో సహా కొనేసుకోవచ్ఛు లేదంటే కేవలం అక్షరాల కుండీల్ని మాత్రమే తీసుకుని అందులో సొంతంగా నచ్చిన మొక్కల్ని పెంచుకోవచ్ఛు వెరైటీగా ఉండటమే కాదు, చూడ్డానికీ ఎంతో అందంగా కనిపిస్తాయి.


మడతపెట్టే వాటర్‌ ట్యాంక్‌!

ఇంట్లో ఉండే ప్రతి వస్తువూ మన అవసరాలకు తగ్గట్టూ మారుతుంటే ఆ మార్పు వాటర్‌ ట్యాంకుల్లోనూ ఎందుకు రాకూడదనుకున్నారో ఏమో తయారీదారులు... మన సౌకర్యార్థం ‘ఫోల్డబుల్‌, కొలాప్సిబుల్‌, ఫ్లెక్సిబుల్‌’ పేర్లతో కొత్తరకం వాటర్‌ట్యాంకుల్ని తీసుకొచ్చారు. మామూలుగా బంధువులు వచ్చినప్పుడో, ఫంక్షన్లు ఉన్నప్పుడో ఇంట్లో ఎక్కువ నీళ్లు అవసరమవుతాయి. అలాంటి సందర్భాల్లో అదనంగా ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసుకుంటాం. అయితే అప్పుడప్పుడు మాత్రమే ఇలా ఉపయోగపడే పెద్ద పెద్ద ట్యాంకుల్నీ, వాటర్‌ టిన్నుల్నీ పెట్టడానికి ప్రత్యేకంగా చోటు కావాలి. కానీ చిన్న ప్యాకెట్‌లానే ఉండే ఈ కొత్తరకం వాటర్‌ ట్యాంకులతో ఆ ఇబ్బందే ఉండదు. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మడత విప్పి ట్యాప్‌ పెట్టేసి క్షణంలో వాటర్‌ ట్యాంకులా మార్చుకోవచ్ఛు మళ్లీ మడతేసి పెట్టేసుకోవచ్ఛు మరి ఆలస్యం ఎందుకు... రకరకాల సైజుల్లో అందుబాటులో ఉన్న ఈ వాటర్‌ ట్యాంకుల్ని మీ అవసరాన్ని బట్టి కొనుక్కోండి.


బొమ్మలే పట్టుకుంటాయి!

డ్రెస్సింగ్‌ టేబుల్‌ దగ్గరో, టీపాయ్‌ మీదనో అలంకరణ కోసం పెట్టుకున్న చూడచక్కని బొమ్మలే అటు అందానికీ ఇటు వాడుకునేందుకూ వీలుగా ఉంటే ఎంత బాగుంటుందో కదూ. అందుకే ముద్దులొలికే అమ్మాయిల ముఖాలతోనే ఎన్నెన్నో వస్తువులు వస్తున్నాయి. అందమైన అమ్మాయి చేతిలోనో, ఒడిలోనో, తలమీదో చక్కగా ట్రే పట్టుకున్నట్టు రకరకాల హావభావాలు పలికే బొమ్మల్లా దొరుకుతున్నాయి ఇవి. డ్రాయింగ్‌ రూమ్, డైనింగ్‌ టేబుల్, డ్రెస్సింగ్‌ టేబుల్‌... ఇలా ఇంట్లో అవసరమైన చోట ఈ బొమ్మల్ని చూడచక్కగా అమర్చుకోవచ్చు. టీవీ రిమోట్, తాళాల గుత్తి, పండ్లు, చాక్లెట్లు, లిప్‌స్టిక్, వాచీ, జ్యువెలరీ... ఇలా అది ఉన్న చోటును బట్టి ఆయా వస్తువులూ, పదార్థాలూ ఈ బొమ్మ ట్రేల్లో పెట్టుకోవచ్చు. 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని