న్యూ ఇయర్... కొత్తగా... వింతగా..!
మన దగ్గర కేరింతలు కొడుతూ, కేక్ కట్ చేస్తూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికితే... కొన్ని దేశాల్లో మాత్రం వింత ఆచారాలతో న్యూ ఇయర్ పండుగను ఆరంభిస్తుంటారు.
న్యూ ఇయర్... కొత్తగా... వింతగా..!
మన దగ్గర కేరింతలు కొడుతూ, కేక్ కట్ చేస్తూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికితే... కొన్ని దేశాల్లో మాత్రం వింత ఆచారాలతో న్యూ ఇయర్ పండుగను ఆరంభిస్తుంటారు. ఆ విశేషాలు ఏంటంటే...
ప్రపంచంలో మొట్టమొదటగా న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యేది పసిఫిక్ సముద్రంలోని ‘కిరిబాటి’ దీవిలో. భారత కాలమానం ప్రకారం... డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం వస్తుంది.
* కొత్త సంవత్సరం ఆఖరిగా వచ్చే భూభాగాలు అమెరికా పరిధిలోని ‘బేకర్, హోవార్డ్’ దీవులు. అయితే అక్కడ జనావాసాలు లేకపోవడంతో చివరిగా న్యూ ఇయర్ వేడుకలు వచ్చే ప్రాంతంగా ‘సమోవా’ ద్వీపాన్ని పరిగణిస్తారు.
* రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో నూతన సంవత్సర వేడుకలను రెండుసార్లు చేసుకుంటారు. ఒకటి జనవరి 1న, రెండోది జనవరి 14న.
బ్రెజిల్ దేశంలో న్యూ ఇయర్ రోజున చాలామంది తెల్లటి దుస్తులు ధరించి పూలూ, కొవ్వొత్తులూ తీసుకుని సముద్రతీరాలకు చేరుకుంటారు. సాగర దేవతకు వీటిని సమర్పించడం వల్ల ఏడాదంతా మంచి జరుగుతుందనేది వాళ్ల నమ్మకం.
డెన్మార్క్‌లో ఏడాదంతా పనికిరాని పాత వస్తువుల్ని దాచి, న్యూ ఇయర్ రోజున బయటకు తీసి పగలగొడుతుంటారు.
ఏడాదంతా పర్యటనలు చేస్తామన్న నమ్మకంతో కొలంబియన్లు కొత్త ఏడాది రోజు ఖాళీ సూట్‌కేసులతో సరదాగా తిరుగుతారు.
ఉల్లిపాయల్ని పునర్జన్మకి ప్రతీకగా భావిస్తారు గ్రీసులో. అందుకే కొత్త ఏడాది మొదలయ్యే రోజున ఇళ్ల ముందు గుత్తులుగా ఉల్లిపాయల్ని వేలాడదీస్తారు.
* జర్మనీ, ఇంగ్లండ్ దేశాల్లో కొత్త ఏడాది రాగానే- తమకు అత్యంత ప్రియమైన వ్యక్తికి ముందుగా ముద్దుతో శుభాకాంక్షలు చెబుతారు. కొత్త ఏడాదిలో మొదటగా చూసిన వ్యక్తి వల్లే ఆ ఏడాదిలో మంచిచెడులు జరుగుతాయనేది వాళ్ల నమ్మకం. అందుకే ఈ ముద్దు సంప్రదాయాన్ని పాటిస్తారు.
* మనం కొత్త ఏడాదిన శుభాకాంక్షలు చెబుతూ బహుమతులు ఇచ్చుకుంటాం కదా. ఈ సంప్రదాయం ప్రాచీన కాలం నుంచీ ఉంది. అయితే పర్షియన్లు- ఉత్పత్తికి సంకేతంగా గుడ్లను కానుకలుగా ఇచ్చుకునేవారు.
* బొలీవియా న్యూ ఇయర్ కేకులకో ప్రత్యేకత ఉంటుంది. కేకులు తయారు చేసేటప్పుడే అందులో ఒకటో, రెండో నాణేలు ఉంచుతారట. కేక్ కట్ చేశాక ఎవరి కేకు ముక్కలో ఆ నాణెం వస్తుందో వాళ్లు అదృష్టవంతులని వాళ్ల విశ్వాసం.
ఆ ఏడాది చేయాలనుకున్న పనుల గురించి కాగితం మీద రాసి, దాన్ని కాల్చి, ఆ బూడిదను నీళ్లలో వేసుకుని తాగితే- ఆ పనులు జరుగుతాయని రష్యాలో నమ్ముతారు.
ఇప్పుడు న్యూ ఇయర్ అనగానే జనవరి ఒకటో తేదీ గుర్తొస్తుంది కానీ మొదట్లో కొత్త ఏడాదిని రోమన్లు మార్చి ఒకటిన జరిపేవారు.
జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకోని దేశాలు... చైనా, ఇజ్రాయెల్, వియత్నాం. ఆ దేశాల్లో వేరు వేరు సమయాల్లో కొత్త ఏడాది వేడుకలు జరుగుతాయి.
* న్యూ ఇయర్ రోజున న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్‌లో కొన్నివేల క్రిస్టల్స్‌తో చేసిన పెద్ద బంతిని ఒక స్తంభం పై నుంచి కిందకు దింపుతారు. ‘బాల్ డ్రాప్’ పేరుతో చేసే ఈ వేడుకను చూడ్డానికి లక్షలాది మంది వస్తారు. 1907 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
జర్మన్లు ‘పంది’ని సంపదకు గుర్తుగా భావిస్తారు. అందుకే కొత్త సంవత్సరం రోజున పిగ్ ఆకారంలో మిఠాయిల్ని చేసుకుంటారు.
గుండ్రని ఆకారాన్ని అదృష్టంగా భావించే ఫిలిప్పీన్స్‌లో కొత్త సంవత్సరం రోజున గుండ్రటి 12 రకాల పండ్లను తింటారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం