చప్పుడు రాదిక..
వాషింగ్ మెషీన్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరి అవసరంగా మారింది. అయితే, దుస్తులు ఉతుకుతున్నప్పుడు- ముఖ్యంగా, నీళ్లు పిండే క్రమంలో అవి స్పిన్ అవుతున్నప్పుడు- డ్రమ్ నుంచి వచ్చే వైబ్రేషన్, శబ్దం బాగా చికాకుపెడతాయి.
చప్పుడు రాదిక..
వాషింగ్ మెషీన్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరి అవసరంగా మారింది. అయితే, దుస్తులు ఉతుకుతున్నప్పుడు- ముఖ్యంగా, నీళ్లు పిండే క్రమంలో అవి స్పిన్ అవుతున్నప్పుడు- డ్రమ్ నుంచి వచ్చే వైబ్రేషన్, శబ్దం బాగా చికాకుపెడతాయి. ఒక్కోసారి మెషీన్ పూర్తిగా ఉన్న చోటు నుంచి కదిలిపోవడం, తిరిగిపోవడం వంటివీ ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, దీనికి ప్రత్యామ్నాయం లేదుగా అనుకుంటాం. కానీ, ఇప్పుడు ఆ సమస్యకు ఈ యాంటీ వైబ్రేషన్ ఐసోలేషన్ ప్యాడ్స్ చక్కటి పరిష్కారం చూపిస్తున్నాయి. మన్నికగల రబ్బర్‌తో తయారు చేసిన ఈ ఫుట్ ప్యాడ్స్‌ని నాలుగువైపులా వీల్స్ కింద పెడితే సరి. మెషీన్ మోగకుండా కదలకుండా మీ పని పూర్తి చేస్తుంది.
అతికించే లైట్లు
గదుల్లో లైట్లు ఉండటం మామూలే. కానీ ‘ఎల్‌ఈడీ మోషన్ సెన్సార్ రీఛార్జబుల్ లైట్ల’ను ఎక్కడైనా వెలుగు తక్కువగా ఉన్న చోట అమర్చుకోవచ్చు. ముఖ్యంగా సొరుగులూ, దుస్తుల అల్మారాల్లో పెట్టుకోవచ్చు. ఏంటి వీటి ప్రత్యేకత అంటే.. వీటికి స్విచ్‌లు అవసరం లేదు. కేవలం బ్యాటరీ సెన్సార్ సాయంతో పనిచేస్తాయి. పైగా మేకులు కొట్టాల్సిన అవసరమూ లేకుండా ఈ లైట్ల వెనుక ఉన్న స్టిక్కరును తీసేసి అతికిస్తే చాలు. సెన్సర్ల సాయంతో డోర్ తీయగానే వెలిగి, మూయగానే ఆరిపోతాయివి. రకరకాల సైజుల్లో ఉండే ఈ లైట్లతో పాటు చిన్న పవర్‌బ్యాంక్ కూడా వస్తుంది. దీని సాయంతో ఒకటి రెండు గంటలు ఈ లైట్లకు ఛార్జింగ్ పెట్టుకుంటే అయిదారుగంటలు వెలుగుతాయి. లేదనుకుంటే బ్యాటరీల సాయంతోనూ వాడుకోవచ్చు. బాగున్నాయి కదూ..
ఆ ముద్రలను మనమూ తీయొచ్చు!
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తొలి జ్ఞాపకం, పాపాయితో మొదటిసారి పెనవేసుకున్న బంధం... ఇలా ఎన్నో అనుభూతులు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాలనిపిస్తాయి. వాటిని తీపి గుర్తులుగా మార్చేందుకు పాదాలూ, చేతి ముద్రలను త్రీడీ ఇంప్రెషన్స్‌గా తీసుకోవడం ఇప్పుడో ట్రెండ్. కానీ అదంతా చేయాలంటే ఇంప్రెషన్లు చేసే సంస్థను సంప్రదించాలి. ఎంతదూరమైనా మన వెంట పిల్లల్నీ తీసుకెళ్లాలి. ఇలా ఇన్నాళ్లూ వీటికి ఎంతో శ్రమ పడటంతో పాటు డబ్బులూ వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఆ ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్‌లోనే ఇందుకు సంబంధించిన ఇంప్రెషన్ కిట్స్ దొరుకుతున్నాయి. ఈ కిట్‌లో ఇంప్రెషన్స్ ఎలా తీయాలో చెప్పే వివరాలూ ఇందుకు అవసరమైన మౌల్డ్, కాస్టింగ్ పౌడర్లూ, ఇతర సరంజామా ఉంటాయి. ఆ ప్రకారం మనమే ఆ ముద్రలను సులువుగా తీసుకుని, మధుర జ్ఞాపకంగా మలుచుకోవచ్చు.
సింకు ఇక శుభ్రం
పాత్రలు కడిగేటప్పుడూ, కూరగాయలను శుభ్రం చేసేటప్పుడూ... కాస్తో కూస్తో చెత్త సింకులోకి చేరుతుంది. ఇక, స్నానాల గదిలో అయితే సబ్బునురుగుతో పాటు జుట్టూ అడ్డుపడుతుంది. ఇవన్నీ నీటిని సాఫీగా పోనివ్వకుండా చికాకు పెడతాయి. ఏ పుల్ల ముక్కతో కదిపినా...ఫలితం ఉండదు. వేణ్నీళ్లూ, బేకింగ్ సోడా వంటివీ కొంతవరకూ ఫలితాన్నిస్తాయి. అలాంటప్పుడు ఈ స్ప్రింగ్ క్లాగ్ రిమూవర్‌ని ఉపయోగించి చూడండి. అడ్డుపడిన చెత్తనూ జుట్టునూ దానికున్న పళ్లతో బయటకు తీయగలదు, లేదా కిందకు నెట్టనూ గలదు. ఆన్‌లైన్‌లోనూ దొరుకుతున్నాయివి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Vikasraj: అక్టోబరులో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం: సీఈవో వికాస్ రాజ్
-
Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
-
politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
-
Tamil Nadu: స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్గాన్ డోనర్స్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-
Chandramukhi2: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చంద్రముఖి-2’.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Jairam Ramesh: ‘కొత్త పార్లమెంట్ మోదీ మల్లీప్లెక్స్’.. జైరాం రమేశ్ విమర్శలకు భాజపా కౌంటర్