కాగితపు బంతులతో అలంకరిద్దాం!

ప్రతి ఇంట్లోనూ పుట్టినరోజనో, పెళ్లిరోజనో ఏదో ఒక వేడుక జరుగుతూనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగా చాలామంది కేకుతో పాటూ సులువుగా, అందంగా అలంకరించేలా రకరకాల డెకరేషన్‌ కిట్స్‌ని కొనుక్కుంటుంటారు.

Published : 03 Dec 2022 23:56 IST

కాగితపు బంతులతో అలంకరిద్దాం!

ప్రతి ఇంట్లోనూ పుట్టినరోజనో, పెళ్లిరోజనో ఏదో ఒక వేడుక జరుగుతూనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగా చాలామంది కేకుతో పాటూ సులువుగా, అందంగా అలంకరించేలా రకరకాల డెకరేషన్‌ కిట్స్‌ని కొనుక్కుంటుంటారు. కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ జ్ఞాపకాల ఫొటోలు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. దాని కోసం ఒక్కోసారి ఒక్కో బ్యాక్‌గ్రౌండ్‌తో అలంకరిస్తుంటారు. పైగా మార్కెట్లోనూ వీటిల్లో కొత్తకొత్తవి వస్తూనే ఉంటాయి. అలా ఈమధ్య ‘హ్యాంగింగ్‌ పేపర్‌ బాల్స్‌ సెట్స్‌’ దొరుకుతున్నాయి. రంగు రంగుల్లో ఉన్న ఈ పువ్వుల కాగితపు బంతులతో ఎవరైనా క్షణాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ని డెకరేట్‌ చేసేయొచ్చు. ఆ అలంకరణ అంతా చూడ్డానికీ విభిన్నంగానూ ఉంటుంది. అంతేకాదు... ఫొటోల్లోనూ ఎంతో బాగా కనిపిస్తాయీ రంగుల బంతులన్నీ కూడా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..