కుక్కమీద బొమ్మ... ఎవరేశారమ్మా..?!

ఓ బుజ్జి కుక్క వెనక్కి తిరిగితే అందాల పాప ముఖం ఉంటుంది... ఇంకో పప్పీ పక్కకు చూస్తే పాండా కనిపించేస్తుంది...

Published : 17 Dec 2022 23:16 IST

కుక్కమీద బొమ్మ... ఎవరేశారమ్మా..?!

ఓ బుజ్జి కుక్క వెనక్కి తిరిగితే అందాల పాప ముఖం ఉంటుంది... ఇంకో పప్పీ పక్కకు చూస్తే పాండా కనిపించేస్తుంది... ఓ అమాయకపు కుక్కపిల్ల మీద ఏకంగా సింహం ప్రత్యక్షమయింది... ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా... ‘క్రియేటివ్‌ పెట్‌ గ్రూమింగ్‌’ పేరుతో చేసిన పెంపుడు జీవుల అలంకరణ. ఒత్తయిన ఫర్‌తో ఉండే పెంపుడు కుక్కలకీ, పిల్లులకీ ముద్దొచ్చే హెయిర్‌ కట్‌ చేయించి, చక్కగా ముస్తాబు చేసి వాటి యజమానులు ముచ్చటపడిపోవడం తెలిసిందే. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి వాటి స్టైలిష్‌ లుక్కుల్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తున్నారు. కాస్త కళాత్మకంగా బుజ్జి కుక్కలూ, బుల్లి పిల్లుల మీదే ఇంకో జీవినో, ముచ్చటైన బొమ్మనో తెప్పించేస్తున్నారు. ఆయా బొమ్మల ఆకారంలో బొచ్చును కత్తిరిస్తూ, రంగులు అద్దుతున్నారు. అదాటున చూసినవారు ‘అరె నిజంగా అవి బొమ్మలా, నిజమైనవా’ అనేలా మాయ చేస్తున్నారు. ఇంత అందంగా ముస్తాబు చేసి, ఎవరికివారే సరదాపడితే ఏం బాగుంటుంది. అందుకే మరి ఆ సోకులన్నింటినీ అందరికీ చూపడానికి‘క్రియేటివ్‌ పెట్‌ గ్రూమింగ్‌’ పోటీలూ పెడుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..