తియ్యని సాహసం

‘చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా... చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన తేనె తీయగలవా?’ అంటూ ఓ చిన్నది సరదాగా పాటపాడితే... ‘బాబోయ్‌, తేనెపట్టు జోలికెళ్తే తేనెటీగలు కుట్టవా’ అంటాడేమో మన దగ్గరి చిన్నవాడు.

Published : 14 Jan 2023 23:38 IST

తియ్యని సాహసం

‘చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా... చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన తేనె తీయగలవా?’ అంటూ ఓ చిన్నది సరదాగా పాటపాడితే... ‘బాబోయ్‌, తేనెపట్టు జోలికెళ్తే తేనెటీగలు కుట్టవా’ అంటాడేమో మన దగ్గరి చిన్నవాడు. కానీ నేపాల్‌లో ఉండే గురుంగ్‌ తెగకు చెందిన ఏ కుర్రాడైనా ‘అదెంత పని’ అనేస్తాడు. ఎందుకంటే చెట్టుకొమ్మల మీది తేనెతుట్టెలే కాదు, ఆకాశాన్నంటుతున్నట్టున్న కొండకొనల్లోని పెద్దపెద్ద తేనెపట్టుల నుంచీ ఈ తెగప్రజలు ఇట్టే తేనె తీయగలరు. ఇక్కడి లమ్‌జుంగ్‌, కాస్కీ జిల్లాల్లో ఉండే గురుంగ్‌ తెగవారు ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న సంప్రదాయ వేట ఇది. దీన్నే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తూ వెదురు నిచ్చెనలూ, తాళ్లూ వేసుకుని పర్వతాల అంచుల దగ్గరకు వెళతారు. తేనెటీగలు కుట్టకుండా ముందుగా అక్కడంతా పొగ పెడతారు. ఆ తర్వాత కర్రలతో తేనెతుట్టెల్ని తీస్తారు.ఒళ్లంతా కప్పేసే దుస్తులు వేసుకున్నా, ఎంతగా పొగపెట్టినా కిందికొచ్చేలోపల కొన్నివందల తేనెటీగలు చుట్టుముట్టి కుట్టేస్తూనే ఉంటాయట. సాహసోపేతంగా సాగే ఈ తేనెవేట గురించి వింటుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..