ఈ సఫారీ... సాహసికులకు మాత్రమే!

రోడ్లు చక్కగా వేసిన ఘాట్‌ రోడ్డు మీద వాహనం నడపడమంటేనే చాలా చాలా కష్టం. అలాంటిది పెద్ద భవనమంత ఎత్తయిన- రోడ్డు లేని కొండ మీదకు ఎక్కడమంటే... ఎంతటి డ్రైవర్లయినా కాస్త బెదరాల్సిందే కదా.

Published : 23 Oct 2022 00:12 IST

ఈ సఫారీ... సాహసికులకు మాత్రమే!

రోడ్లు చక్కగా వేసిన ఘాట్‌ రోడ్డు మీద వాహనం నడపడమంటేనే చాలా చాలా కష్టం. అలాంటిది పెద్ద భవనమంత ఎత్తయిన- రోడ్డు లేని కొండ మీదకు ఎక్కడమంటే... ఎంతటి డ్రైవర్లయినా కాస్త బెదరాల్సిందే కదా. అమెరికాలోని మోబ్‌ నగరానికి దగ్గర్లో ఉన్న పే...ద్ద జారుడుబండ లాంటి ‘లయన్స్‌ బ్యాక్‌’ కొండమీద సఫారీ అచ్చం అలాంటిదే. గుట్టలూ, లోయల మధ్య 350 అడుగుల ఎత్తున్న ఈ కొండ మీద సఫారీ కోసం ఒకప్పుడు సాహసికులు జీపులూ, ట్రక్కులూ తీసుకుని బారులుకట్టేవాళ్లు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా కిందపడిపోయేలా ఉన్న ఈ సాహసం చేయడానికి పోటీపడేవారు. కొన్నాళ్లకు ఓ ప్రైవేటు వ్యక్తి ఈ స్థలాన్ని కొనుక్కోవడంతో 2004 నుంచి లయన్స్‌ బ్యాక్‌ కొండ మీద పబ్లిక్‌ రైడ్లని మూసేశారు. కానీ ఇప్పటికీ కొంతమంది ప్రత్యేక అనుమతితో రైడ్లు చేస్తుంటారు. ఎంతో థ్రిల్‌ని అందించే ఈ కొండ మీద సాహసికుల కోసం ఏటా జీప్‌ సఫారీలూ నిర్వహిస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..