ఈ కోటకు ఎవరైనా రాణి కావచ్చు..!

చుట్టూ పచ్చని కొండలు... మధ్యలో పే...ద్ద సరస్సు... అందులో ఉందో అందాల రాకుమారి కోట... అంటూ ఫెయిరీ టేల్స్‌లో వినుంటారు. డిస్నీ సినిమాల్లోనూ చూసుంటారు. కేవలం మాటల్లోనో, దృశ్యాల్లోనో కాదు... అచ్చంగా అలాంటి అద్భుతమైన కోట ఒకటుంది.

Published : 12 Nov 2022 23:22 IST

ఈ కోటకు ఎవరైనా రాణి కావచ్చు..!

చుట్టూ పచ్చని కొండలు... మధ్యలో పే...ద్ద సరస్సు... అందులో ఉందో అందాల రాకుమారి కోట... అంటూ ఫెయిరీ టేల్స్‌లో వినుంటారు. డిస్నీ సినిమాల్లోనూ చూసుంటారు. కేవలం మాటల్లోనో, దృశ్యాల్లోనో కాదు... అచ్చంగా అలాంటి అద్భుతమైన కోట ఒకటుంది. చైనాలోని వాన్‌ఫెంగ్‌ సరస్సులోని చిన్న దీవిలో ఎంతో ఎత్తయిన కొండ మీద కొలువై ఉంటుంది. జానపద కథల్లోని కోటలా ఉంటుంది కాబట్టి దానికి ‘ఫెయిరీటేల్‌ క్యాజిల్‌’ అనే పేరు పెట్టారు. నిజానికి ఇదో పెద్ద హోటల్‌. ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా కొండల నడుమ వంతెనను కలుపుతూ 2011లో కట్టారు. కల్పిత కోట- కళ్లముందు కనిపిస్తే ఎవరినైనా ఆకట్టుకోకుండా ఉంటుందా... అందుకే ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు ఇక్కడ బస చేయడానికి జంటలు జంటలుగా బారులు తీరతారు. తమని తాము కోటలోని రాజూరాణీల్లా ఊహించుకుంటూ ఆ మధుర క్షణాల్ని సరదాగా ఫొటోల్లో బంధించుకుంటారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు