ఒయాసిస్సులో... హైలెస్సో!

సూర్యకిరణాల తాకిడికి మెరిసిపోయే బంగారు ఇసుక తిన్నెలూ... మధ్యలో ఆకుపచ్చ రంగులో తళుకులీనే నీటి జాడలూ... ఆ అందాల్ని ఆస్వాదించడానికి చుట్టూ ఎన్నెన్నో వసతులూ... ఇవీ పెరూలోని వాకచీనా అనే ఓ చిన్న ఊరి ముచ్చట్లు.

Updated : 16 Apr 2023 01:06 IST

ఒయాసిస్సులో... హైలెస్సో!

సూర్యకిరణాల తాకిడికి మెరిసిపోయే బంగారు ఇసుక తిన్నెలూ... మధ్యలో ఆకుపచ్చ రంగులో తళుకులీనే నీటి జాడలూ... ఆ అందాల్ని ఆస్వాదించడానికి చుట్టూ ఎన్నెన్నో వసతులూ... ఇవీ పెరూలోని వాకచీనా అనే ఓ చిన్న ఊరి ముచ్చట్లు. ఎడారి మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన సరస్సు చుట్టూ అల్లుకున్న ఈ చోటు- మంచి సందర్శక ప్రాంతం. వంద మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో ఇళ్లతో పాటూ రెస్టరంట్లూ, హోటళ్లూ చాలానే ఉంటాయి. ఇక్కడి ఒయాసిస్‌లో సరదాగా పడవ ప్రయాణం చేయడానికీ ఇసుక దిబ్బలపైన డ్యూన్‌ బగ్గింగ్‌, శాండ్‌ బోర్డింగ్‌లాంటి సాహస క్రీడల్లో పోటీపడ్డానికీ... వేలాది పర్యటకులు కార్లూ, జీపులేసుకుని వచ్చేస్తుంటారు. ఎప్పుడూ నీటితో ఉండే ఈ ఒయాసిస్‌... అందానికే కాదు, వ్యాధుల్ని తగ్గించే ఔషధ గుణమున్న సరస్సుగానూ పేరుపొందింది. అందుకే పిల్లలూ, పెద్దలూ ఈ నీటిలో సరదాగా స్నానం చేసేస్తుంటారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు